పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

48

గ్రామ కైఫియత్తులు


చేస్కుంటూ వచ్చినారు. పయినివ్రాశి రామకృష్ణయ్య అతని కొమారుడు మంగ్గగళాద్రి మొగలాయిలో ప్రవృత్తి౯ంచినారు. మొదలాయి అమాని ఆఖరులోనే దేవాలయముల్కు అర్చనలు జర్గక బలమైపోయ్నిది స్న ౧౧౨౨ ఫసలీ (1712 AD)లో కొండ్డవీటి శీమ జమీదారుల౯కు మూడు వంట్లు చేసి పంచి పెట్టే యెడల యీ గ్రామం మానూరి వెంకన్న మజ్ముందారిగారి వంట్టులో చేరినంద్ను వెంకన్న గారు ప్రభుత్వం చేస్తూ యిచ్చిన యినాములు.——

కు ౦ ౺ ౦ వుపద్రష్ట సీతారామ శాస్త్రుల్ల౯ వారికి
కు ౦ ౺ ౦ మంత్రవాది గంగ్గాధర శాస్త్రుల్ల౯ గారికి.

యినాములు యిప్పించ్చి ౧౧౪౦ ఫసలీ (1731 AD) వర్కు ప్రభుత్వం చేశ్ని తర్వాతను అప్పాజీ పంత్తులు వెంక్కట్రాయినింగారు స్న ౧౧౬ం ఫసలీ ( 1750 AD) వరుకు ప్రభుత్వంచేస్ని తర్వాతను వెంక్కట కృష్ణనింగారు స్న ౧౧౬౧ ఫసలీ (1751 AD) లో ప్రభుత్వాన్కు యిచ్చిన యినాములు.

కు ౦ ౺ ౦ వుమ్మెత్తాలి కృష్ణప్ప పంతులు గారికి
కు ౧ శివలంక్క బుచ్చయ్య అయ్యవాల౯ గారికి
కు ౦ ౹ ౦ మండవరామకృష్ణప్ప గారికి -
కు ౦ ౹ ౦ యీ వెంకన్నగారికి
కు ౦ ౹ ౦ యీలక్ష్మీనర్సుకు
కు ౧ నంబిరాజు రాయలు పంత్తులు గారికి
————————
కు ౩ ౹ ౦
————————

యినాములు యిప్పించి స్న ౧౧२౮ ఫసలీ (1768 AD) వర్కు ప్రభుత్వం చేసెను. తదనంతరం వీరి కుమారులయ్ని నర్సంన్నారావు స్న౧౧२౯ ఫసలీ (1769 AD)లో ప్రభుత్వానకు వచ్చి యిచ్చిన యినాములు———

కు ౦ ౹ ౦ మండవ వెంక్కటాచార్యులు గారికి
కు ౦ ౹ ౦ యీ సోమంన్న గారికి
కు ౦ ౹ ౦ యీ వెంకంన్న గారికి
కు ౦ ౹ ౦ గ్రామ పౌరోహితునికి పోతూరి శ్రీగిరి భట్లు
కు ౦ ౹ ౦ ఆలపాటి వీరంన్న చెర్వు వేయించినాడు గన్కు యిచ్చిన మాన్యం.
————————
కు ౧ ౹ ౦

యినాములు యిప్పించి స్న ౧౨౧౯ ఫసలీ (1809 AD) వరుకు అధికారము చేశెను. అటు పింమ్మట వీరి తమ్ముడి కొమారుడయిన వెంక్కట కృష్ణునింగ్గారు ప్రభుత్వాన్కు వచ్చి ౧౨౨౧ ఫసలీ (1811 AD) వర్కు ప్రభుత్వం చేస్తూ వుంన్నారు.

నవంబరు ౨౫ 24 తారీఖు ౧౮౧౨ (1812 AD) సంవత్సరం.