పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

50

గ్రామ కై ఫియత్తులు


పంత్తులు గారి వంట్టులో వచ్చి చిల్కలూరిపాడు తాలూకాలో దాఖలు అయినది. వెంక్కంన్న పంత్తులు, అప్పాజీ పంత్తులు, వెంక్కటరాయునింగారు స్న ౧౧౬౪ (1754 AD) ఫసలీ వర్కు ప్రభుత్వం చేశిన తరువాతను వెంక్కట కృష్ణునింగారు స్న ౧౧౬౫ (1755 AD) ప్రభుత్వానకు యిచ్చిన యినాములు:

౦ ౹ ౦ గ్రామ పౌరోహితుడైన పోతూరి వెంక్కట జోష్యులు గారికి.
౦ ౹ ౦ గ్రామకరణం మోదుకూరి లింగ్గరాజుకు కరణీకపు మాన్యం.
౦ ౹ ౦ గుదిమెళ్ళ వెంక్కటాచార్యులు గారికి
౦ ౹ ౦ ౦ గడ్డిపాటి వెంక్కటాచలముకు యిప్పించిన యినాము .
————————
౧ కుచ్చెల పోలం యినాము యిప్పించిన వెంక్కట కృష్ణునింగారు వీరి కొమారులయ్ని నరసంన్న గారు

స్న ౧౨౧౯ శకం (1809 AD) వర్కు ప్రభుత్వం చేసిన తర్వాతను నరసంన్న గారి తమ్ములయ్ని వెంక్కంన్నగారి కొమారుడు వెంక్కట కృష్ణనింగారు సదరహి ఫసలీ లగాయతు ప్రభుత్వానకు వచ్చి అధికారం చేస్తూ వుంన్నారు.

రిమాకు౯ : గ్రామం గుడికట్టు కుచ్చెళ్లు ౩ఽ౺౦కి మినహాలు

౧ గ్రామ కంఠం
౧ వనం తోటలు ౪కి
౦ ౹ ౦ గడ్డిపాటి వెంక్కటాచలం వనంత్తొట గ్రామన్కు వాయువ్య భాగానను.
౦ ౹ ౦ గడ్డిపాటి ఆంక్కంప్ప గ్రామాన్కు తూపు౯ భాగమంద్దు
౦ ౹ ౦ యలవతి౯ చవుదరి దక్షిణభాగమంద్దు
౦ ౹ ౦ యడ్లనారాయణ వనంత్తోట పూరి వుత్తర భాగమంద్దు
౧ చెరువులు 3కి
౦ ౺ ౦ గడ్డిపాటి వెంక్కటాచలం చర్వు గ్రామాన్కు వుత్తర భాగమంద్దు
౦ ౹ ౦ గోపకుంట్ట గ్రామాన్కు వుత్తర భాగమంద్దు
౦ ౹ ౦ చింత్తగుట్ట వూర్కి పడమంటి భాగమందు