పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దండ్డమూడి

45


తదనంత్తరం మ్లేచ్ఛా క్రాంతమయ్నింద్ను అగ్రహారపు సౌజ్ఞ తప్పి మ్లేచ్చ ప్రభువులు కరిణీకపు హొదాలో వుండేలాగ్ను పయ్నివాశ్ని శీతాపతి అయ్యవారి కుమారుడు రామకృష్ణయ్యను నిన్న౯యించ్చి కొండ్డవీటి శీమ సముతు బంద్దీలు చేశేటప్పుడు వీరు యీ గ్రామం పొంన్నూరు సముతులో చేచి౯ మాణిక్యారావు గార్ని దేశముఖి మన్నె వారుగా నుంన్ను మానూరి వారిని మజుందాలుగానున్ను పాతృని వారిని దేశపాండ్యాలుగా నుంన్ను నిన్న౯యించ్చి అల్లవృత్తి౯వారిని సముతుకు మాత్రం చవుదలు౯గానుంన్ను యేప౯రిచినారు గన్కు సముతు అమీలు గుండ్డా పయ్ని వాన్ని దేశస్తుల పరంగ్గా తమ గ్రామం యొక్క కమాయిషు (కమామీసు) చేసుకుంట్టూ వచ్చినారు పయిన వాశ్ని రామ కృష్ణయ్య అతని కొడుకు మంగ్గళాద్రి మొగలాయిలో ప్రవత్తి౯ంచ్చినారు.

మొగలాయీ అమానీ ఆఖరులోనే దేవాలయములకు ఆచ౯నాదులు జరుగక ఖిలమయి పోయినవి. ౧౧౨౨ ఫసలీలో (1712 AD) కొండ్డవీటి శీమ జమిందాల౯కు మూడు వంట్లు చేసి పంచ్చిపెట్టె యడల యీ గ్రామం మానూరి వెంక్కన్నమజత్మదారు గారి వంట్టులో వచ్చినది. వెంక్కంన్న గారు ప్రభుత్వం చేస్తూ యిచ్చిన యినాములు--

కు ౦ ౺ ౦ వుపద్రష్ట శీతారామ శాస్త్రుల౯ గారికి
కు ౦ ౺ ౦ మండ్డవ గంగ్గాధర శాస్తుల౯ గారికి.
————————

౧ కుచ్చళ్ల యినాము యిప్పించ్చి స్న ౧౧౪౧ (1750 AD) ఫసలీ వర్కు ప్రభుత్వం చేశ్ని తర్వాతను ఆ... పంత్తులు వెంక్కటరాయనింగ్గారు ౧౧౬౦ ఫసలీ వర్కు ప్రభుత్వం చేశ్ని తర్వాతను వెంక్కట కృష్ణునింగారు స్న ౧౧౬౦ ఫసలీ (1751 AD) ప్రభుత్వాన్కు వచ్చి యిచ్ని యినాములు.

కు ౦ ౺ ౦ వుమ్మెత్తాల కృష్ణప్ప పంతులు గారికి
కు ౧ శివలంక్క బుచ్చయ్య అయ్యవాల౯ గారికి
కు ౦ ౹ ౦ మండ్డవ రామకృష్ణ గారికి
కు ౦ ౹ ౦ యీ వెంక్కంన్న గార్కి
కు ౦ ౹ ౦ లక్ష్మీనారాయణ గార్కి
కు ౧ సుబ్బరాజు రాయలు పంత్తులుకు
————————
కు ౩ ౦

యినాములు యిప్పించ్చి స్న ౧౮२౮ ఫసలీ పర్కు (1768 AD) ప్రభుత్వం చేశెను. తరవాత వీరి కొమారులయ్ని నరసన్నా రావు గారు స్న (1769 AD) ఫసలీలో ప్రభుత్వానకు వచ్చి యిచ్ని యినాములు.