పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

44

దండ్డమూడి

కయిఫియ్యతు మౌజే దండ్డమూడి సంతు పొంన్నూరు సర్కారు మృతు౯

జాంన్నగరు పరగణే తాలూకే చిక్కలూరిపాడు యిలాకే రాజామసూరి వెంక్కట

కృష్ణారావు.

గ్రామాన్కు పూర్వం నుంచ్చీ దండ్డమూడి అనే పేరు వుంన్నది.

గజపతి శింహ్వాసనస్తుడయ్ని లాంగ్లూల గజపతి మహారాజులుంగ్గారు పరాక్రమ వంత్తులై రెడ్డి కన్నా౯టక రాజులను జయించి ప్రభుత్వం చేశేటప్పుడు యజుశ్శాఖాధ్యయ నులుంన్ను కాస్యపస గోత్రోద్భవులుంన్నూ అయిన మండవ శ్రీ రామమునులు గారు బహు శాస్త్రవేత్తలుంన్ను స్సంపన్నులుంన్నూ అయివుంద్దురు గన్కు వారి వల్ల నుంచ్చింన్ని సమస్త ధర్మశాస్త్రములు తెలియడాన్కు పౌరాణికత్వమునకు నిన్న౯యించ్చే వారివల్ల నుంచ్చింన్ని సృతిస్మృతి పురాణేతిహస సత్యాధి పలుకులు విని సంత్తొషించ్ని వారయి పౌరాణికులు పుత్రపౌత్ర పారంపర్యం జరగడాన్కు శాశ్విత జీవనములు చాయవలెనంన్న తాత్పర్యము చాతను శ్రీ రామమునులు గార్ని సన్మానించ్చి స్వస్తిశ్రీ శాలివాహన శకంబ్బులు ౧౩౪౧ (1419 AD) శకమంద్దు దండ్లమూడి అనే అగ్రహారం చేసి అష్ట భోగ సహితము గాను ధారా గ్రహీతం చేశినారు గనుక శ్రీరామునులు గారు అగ్ని హోత్రములతోటి యీ దండ్లమూడి అగ్రహారములోకి వచ్చి ప్రవేశించ్చి గృహ నిర్మాణములు చేసుకొని శిష్యులకు వేద శాస్త్రములు చెప్పుతూ నిరతాంన్న దానపరులై శ్రీరామమునులు గారుంన్ను వీరి కుమారులయ్ని రామానుజాచార్యులు వీరి పుత్బులు వెంక్కటాచార్యులు కన్నా౯టక ప్రభువు అయ్ని రామరాయలు వారి అధికారం పర్కు జర్గిన తర్వాతను శ్రీ రంగ్గ రాయలు వారు ప్రభుత్వంలో శీతాపతి ఆయ్యవారుగారు బ్రాంహ్మ విద్వాంసులు అయివుంద్దురు గన్కు వీరిని చాలా సన్మానించ్చి ఆగ్రహారములు యిచ్చినారు గన్కు అయ్న యీ స్తలమంద్దు దేవస్తానములు కట్టించ్చి శ్రీ కేశవస్వామి వాల౯ను ప్రతిష్ట చేశి నిత్య నయివేద్య దీపారాధనలు జరుగ గలంచులకు.

కు ౦ ౺ ౦ శ్రీ రామేశ్వర స్వామి వారికి..…-
కు ౧ కేశవ స్వామి వారికి---
—————————
౧ ౺ ౦ కుచ్చళ్ళ భూమి యినాము యిప్పించినారు.