పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

32

గ్రామ కై ఫియత్తులు


మించ్చుకుని ఆమీనుముల్కు అనే అతంన్ని యీ దేశాన్కు ప్రభుత్వం నిమిత్తం పంపించే గన్కు అతని ఆవడి చాతను దేవాలయముల్కు ఆచ౯నాదులు జరగకపోయెను.

తదనంతరం మొగలాయీ వారు యీ కొండ్డవీటి శీమ సర్కారు సంతు బంద్దీలు చేశే టప్పుడు యీ గ్రామం పొన్నూరు సముతులో దాఖలు చేసినారు. గన్కు, సంతు ఆమీలు చౌదరు దేశపాండ్యాల పరంగ్గా బహుదినములు అమాని మామలియ్యతు చేస్కుంన్నారు.

స్న ౧౧౨౨ (1712 AD) ఫసలీలో యీ సర్కారు జమీదాల౯కు పంచ్చి పెట్టే యడల యీ గ్రామం మానూరి వెంక్కంన్నా మజుందారు గారి వంత్తు వచ్చి చిల్కలూరి పాటి తాలూకాలో దాఖలు అయ్నిది గన్కు వెంక్కంన్న పంత్తులు గారు అప్పాజీ పంత్తులు గారు ప్రభుత్వములు జరిగిన తర్వాతను. వెంక్కట రాయనింగారు స్న ౧౧౪౪ వసలీ (1734 AD)లో ప్రభుత్వానకు వచ్చి న్న ౧౧౬౩ (1753 AD) ఫసలీలోను బాలకి పెద సంగ్దంన్న గారికి.

కు ౦౺౦ అరకుచ్చల యినాము యిచ్చి సదరహి ఫసలీ లగాయతు స్న ౧౧౬౪ ఫసలీ (1554 AD) వర్కు ౨౧ సంవ్వత్సరములు రాజ్యం ప్రభుత్వం చేశెను.

తదనంత్తరం వెంక్కట కృష్ణునింగారు స్న ౧౧౬౫ (1775 AD) ఫసలీలో ప్రభుత్వానకు వచ్చి అధికారం చేసేటప్పుడు వీరిది వాసులయ్ని వుమ్మెత్తాల నరుసు పంత్తులు గారు గ్రామానకు దక్షిణం పంట్ట చెరువు త్రవ్వించ్చినారు. వీరి అనుజులయ్ని కృష్ణంమ్మ గారు, గ్రామాన్కు పశ్చిమం పంట్ట చెరువు త్రవ్వించ్చినారు. యీ వెంక్కట కృష్ణునిం గారుంన్ను సదరహి ఫసలీ లగాయతు ప్రభుత్వం చేస్తూ యిచ్చిన యినాములు.

౦ ౹ ౦ వేదాంతం వెంగ్గళా చార్యులు గార్కి ఖరనామ సంవత్సరములో యిచ్ని యినాము.
౦ ౹ ౦ పూర్వోత్తరము నుంచ్చి గ్రామ పౌరోహితుడైన రామడుగు రంగ్గప్పకు యిచ్చిన యినాము.
౦ ౹ ౦ బాలకి వీర రాఘవులకు-
౦ ౺ ౦ మజ్కురి కరణమయ్ని కొలి౯మల౯ పేర్రాజు యిచ్చిన యినాము.
౦ ౹ ౦ స్న ౧౧౮౦ ఫసలీ (1770 AD) ఖరనామ సంవ్వత్సరములో గ్రామాన్కు వాయవ్య భాగమంద్దు చెరువు త్రవ్వించినాడు గన్కు :::యిచ్ని యినాము.
౦ ౹ ౦ కరణీకపు యినాము రాయించ్నిది.
౦ ౦ స్న ౧౧౮౪ ( 1774 AD) ఫసలీలో వోరుగంటి జటావల్లభుని గారికి.