పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

31

కొలి౯ మల౯

కయిఫియ్యతు । మౌజే కొలి౯మల౯ సంతు పొంన్నూరు తాలూకా చిల్కలూరు

పాడు మృతు౯జాంన్న గరు యిలాకే రాజా మానూరి వెంక్కట కృష్ణారావు-

యీ గ్రామానకు పూర్వం నుంచ్చి కొలి౯మల౯ అనే వాడికి వున్నది. గజపతి శింహ్వాసనస్తుడయ్ని గణపతి మహారాజులుంగారు. శాలివాహనం ౧౦౫౬ (1134 AD) శకం లగాయతు ప్రభుత్వం చేస్తూ వుండ్డి వుండ్డగా వీరి దగ్గర మహా ప్రధానులయ్ని గోపరాజు రామంన్నగారు, శాలివాహనం ౧౦౩२ (1145 AD) శకమంద్ద బ్రాంహ్మణులకు మిరాశీ నిన౯యించ్చె యడల కోలి౯మల౯కు వెలనాడు మౌద్గల గోతృలయ్ని ప్రభాకరునికి యేక భోగంగ్గా గ్రామ కరిణీకపు మిరాశీ నిన౯యించినారు గన్కు అతను కొన్ని సంవ్వత్సరములు అనుభవించ్చిన తర్వాతను అతని కొమారుడయ్ని మూలి౯ రాజు శాలివాహనం ౧౧౧२ (1195 AD) శకమంద్దు గ్రామంకు తూపు౯భాగమంద్దు వారికి యిష్టదై వమయ్ని అదిలక్ష్మి కామేశ్వరి అమ్మవారి పేరను చెర్వు వేయించ్చి యీ చెరువు పడమటి కట్టమీదను శివాలయం కట్టించ్చి శ్రీ రామలింగ్గ స్వామి వారనే లింగ్డమూతి౯ని ప్రతిష్ఠ చేశి యీ ఆలయానకు వుత్తర భాగమంద్దు కామేశ్వరి అమ్మవారికి శింహ్వసనమని శిలాపీఠం వేయించ్చి అక్కడ వుయ్యాల యేప౯రచి గ్రామానకు వాయువ్యమూలను విష్ణు స్తలం కట్టించి శ్రీ వేణు గోపాలస్వామి వారిని ప్రతిష్ఠ చేశి శ్రీ ఆంజనేయ ప్రతిష్ఠానుంన్ను చేయించ్చిన వారయి యీ గ్రామానకు పుత్తర భాగమంద్దు గణాధిపతి ప్రతిష్ట చేశి నిత్య నైవేద్య దీపారాధనలకు యిచ్చిన యినాములు.

౧ శ్రీ రామలింగ స్వామి వారికి గణాదిపతికి యిచ్చిన యినాము.
౧ శ్రీ గోపాల స్వామి వారికి ఆంజనేయస్వామి వారికి యిచ్చిన యినాము.
———
౨ రెండు కుచ్చళ్ళున్ను గజపతి వారిచాతను సదరు వ్రాయించి యిప్పించ్చి స్వామి వాల౯కు సకలోత్సవములు జరిగించ్చినారు.
———

తదారభ్యా ప్రభాకరుడు మూతి౯రాజు వంశీకులయ్నివారు కొలి౯మల౯ వారనే గ్రామనామం అగృహ నామం కలిగి పిడివలి దలిపిడీలుగా మిరాశీ రశ్మితేజో పాజ౯నుల అనుభవిస్తూ వుండ్డి పుంన్నారు. రెడ్డి వడ్డె కనా౯టక ప్రభుత్వములు శాలివాహనం ౧౫౦౦ శకం (1578 AD) వరకు జరిగిన తర్వాతను మ్లేచ్చ ప్రభువులు అయ్ని మలికి విధురాం పాదుశహా వారు హిందూ రాజయ్ని శ్రీ రంగ్గరాయలు వారిని జయించ్చి యీ దేశము ఆక్ర