పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వేరూరు ౧౪౪౩ (1521 AD) అగునేటి చిత్రభాను సంవత్సర శ్రావణ శు॥ ౧౧ (11) సోమవారం రోజున శ్రీ వేరూరి శ్రీ చంన్న కేశవరాయుడి భోగమంటపము అచ్చిరాజు వెంక్కట యోగి కట్టించ్చినారు గనుక సూరనేని ఆచ్చిరాయునింగ్గారు ప్రభుత్వం చేస్తూ కు = భూమి యిప్పించినారు. శా౧౫౦౨ శకం కృష్ణరాయులు, అచ్యుత రాయులు, శ్రీ రంగ్గరాయులు మొదలయిన కంన్నాట్క రాజులు శా ౧౫౦౦ శకం (1578 AD) వర్కు ప్రభుత్వము చేరి గన్కు ధర్మవంత్తులయిన పయిన వ్రాశిన దేవ బ్రాహ్మణ వృత్తులు నిరాటంక్కంగా జరిగించినారు. (1530 AD)లో కనాటక పాదుశహా అయిన శ్రీ రంగారాయలును జయించ్చి మల్కీ విభు రాము యా తద్రాజ్యమున్నూ ఆక్రమించ్చుకొని కొండవీటి దుగ్గణం పుచ్చుకొంన్నారు గన్కు అప్పట్లో శ్రీ స్వామి వాల్లకు పూర్వపు రాజులు నినయించ్చిన బాహరి స్వాస్త్యముల జప్తు చేసుకొని క్లుప్తంగా చేసిన స్వాస్త్యము : కుం కు కు 217 C శ్రీ మూలస్తాన సోమేశ్వర స్వామి వారికి శ్రీ కేశవ స్వామి వారికి శ్రీ వీరభద్రస్వామి వారికి యీ ప్రకారంగ్గా నిన౯యించ్చి అధికారం చేస్తూ కొఁడ్డవీట శీమ సముతు బంధీలు చేశేటప్పుడు మౌజీ మజుకూరు నాదెండ్ల సముతులో దాఖలు చేశి సముతు అమీలు బేదరు దేశ సాండ్యాల పరింగ్గా అమాని మామియ్యతు జరిగించే యడల శా౧౬౦౮ (1887 AD) అగు నేటి క్షయ సంవత్సరమునందునను సంభవించిన క్షామము చాతను దేవస్తానములకు అచదా నాదులు జరుగక ఖిలపడ్డది. స్న౦౧౨౨ ఫసలీ (1712 AD)లో కొండవీటి శీమ వంటు చేశి జమీనాల్లజకు పంచ్చి పెట్టే యడల యీ గ్రామం సర్కారు మజుందారులయిన మానూరి వెంక్కంన్న పంత్తులు గారి వఁట్టులో వచ్చి చిలకలూరి పాటి తాలూకాలో దాఖలు అయినది. గన్కు వెంక్కంన్న పంత్తులు గారు అధికారం చేస్తూ అధలతోందరను గురించి యేలూరు వగయిరా తొమ్మిది గ్రామాదులు వాశిరెడ్డి పద్మనాభనింగ్గారు విక్రయించ్చి యిచ్చినారు ముఠే దేహయి తెప్సీలు. కసుబే వేస్తారు ౧ తుల౯ పాడు కాపుర్రు సొలస ౧ చిరుమామిళ్ళం గోవిందపురం కావూరు బయిశికాపురం గంన్నే పూడి వెరశి తొమ్మిది గ్రామాదులు ముఠా చేశి వేరూరు ముఠా అర పేరు బెట్టి పద్మనాభని గారికి యిచ్చిరి గన్కు పద్మనాభనింగ్గారు, చంద్రమౌళిగారు, పెద్ద రామ లింగ్దంన్న గారు నర్సంన్నగారు, సూరంన్నగారు, చిన నర్సింన్నగారు, చిన రామలింగంన్న గారు జగ్గయ్యగారు ప్రభుత్వము చేసిన తర్వాతను రామున్నగారు ప్రభుత్వము వహించి అధికారు చేస్తూ వుండగా స్న౦౨ ఫసలీ (1772 AD)లో మజుకూరి మిరాశీదారు డయి: అచ్చిరాజు నరిశింగరాయుడు యీ గ్రామంలో వుండే మూలస్తానేశ్వర స్వామి వారి ఆలయం జీన్నోద్ధారం చేయించ్చి శ్రీ స్వామి వారిని పునః ప్రతిష్ఠ చేయించినాడు గన్కు యీ దేముని నిత్య నయివేద్య దీపారాధనలకు రామన్నగారు కుభూమి యినాం యిప్పించ్చి దీపారాధనల్కు పండుగలకు సాలియానా జరుగడాన్కు వో ఆరు వరహాలు చొప్పున సిన