పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

215 వేరూరు కయిఫియ్యతు మౌజే వేరూరు ముఠే మజుకూరు సముతు నాదెండ్ల సరకారు మృత్యు జాంన్నగరు యిలాకే రాజా వాసిరెడ్డి వెంక్కటాద్రినాయుడు బహదరు మంన్నె సులతాను స్న ౧౨౨౨ ఫసలీ (1812 AD). పూర్వం యీ స్థలం బహు అరణ్యంగ్గా పుఁడ్డు గనుక యిక్కడ రుషి ప్రార్థన చాతను శ్రీ ములస్థాన సోమేశ్వరస్వామి వారు స్వయం వ్యక్తంగా అవతరించినారు అనువాడికె వున్నది. తదనంతరం కలియుగ ప్రవేశమయిన తరువాతను యీ స్తలమందు గ్రామము యేర్పడి వేకూరు అనే వాడికె వచ్చినది. శాలివాహన శక ప్రవేశమయిన తర్వాతను శ్రీ మన్మహా మండలేశ్వర త్రిభువన బిరుదులు వెంన్ను సంచ్చేల ఆలమందల కారా కొల్లి దేవ చోడ మహారాజులు ప్రభుత్వం చేశే టప్పుడు పయిన వ్రాశిన మూలస్థాన సోమేశ్వర స్వామి వాల్ల ఆలయం మంటపములు నిర్మాణం చేయించ్చి స్వస్తి శ్రీ శక వరుషంబ్బులు ౧౫౦ (152 AD) ఆగునేటి సౌమ్య సంవత్సరం జ్యేష్ఠ బ॥ ౨ శుక్రవారం శ్రీమతు వేరూరి మూలస్తాన సోమేశ్వర దేవరకు యిచ్చిన ధర్మశాసనం కొండవీటి శీమ మాకు చెల్లే వేరూరి గ్రామాన సోమేశ్వర దేవరకు బెట్టిన చేనుమూడు పుట్టకుంన్నూ వృత్తిపన్ను కట్నముకాని కౌలు దారపోసి సమప్పిక్షా స్తిమి. అని యీ ప్రకారంగ్గా యేతద్మఁబ్బులు శాసన స్తంభాల మీద లిఖింపచేసినారు. ఆ పింమ్మట శ్రీ మన్మహా మండలేశ్వర పరిణేధ తిక్క భీమరాజులు ప్రభుత్వానకు వచ్చి స్వస్తిశ్రీ శక వరుషంబ్బులు ౧౯౨౫ (1008 ADj ఆగునేటి వుత్తరాయణ సంక్రాంత్తి తిధియందు వేరూరి మూలస్థాన సోమేశ్వర దేవరకు హవిబలి అచక్రానాదులకు బెట్టిన వృత్తి ఖ ౨ యీ స్తానపతి సూరేశ్వర పండితుల పుత్రుడు సోమనాధులు అతని పుత్రాను పౌత్రికము ఎప్పుడూ ఆరాధించువారు. అని యీ ప్రకారంగా స్థానపతి వారి పరం చేశినారు. తదనంతరం స్వస్తి సమధి గత పంచ మహా శబ్ధ మహామండలేశ్వర కొల్లిపాక పురవరా ధీశ్వం చలమత్తికా గడ్డ స్వస్తి చతుస్సముద్ర ముద్రిత అఖిల నిఖిల వసుంధరా పరిపాలక శ్రీ మత్రినయిన పల్లవ ప్రసాదాసాదిత కృష్ణ వేణ్యానది దక్షణ షట్సహస్ర గ్రామవనీ వల్లభ సహకార చోళ చాళుక్య సామంత మరావేక మృగేంద్ర విభవామరేంద్ర గఁడ్డర గండ్డ బేరండ్డ జగ మెచ్చుగఁడ్డ నగ్ని మత్తాకా౦డ్డ శ్రీ మన్మహా మండలేశ్వర పరోదభీమ రాజులు కొమారులయిన కుసుమ రాజులు సమస్త బిరుదాంకితఁబ్బుల ప్రశిద్ధి వడశి శ్రీ స్వామి వార్కి సకలోత్సవములు చేయించ్చి సూర్యగ్రహణ కాలమందు అనేకములయిన బ్రాహ్మణ్యులకు