పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పెద చర్కూరు కయిఫియ్యతు కసుబె పెదచర్కూరు స్కూరు ముత్తు జాంన్నగరు తాలూకే చిల్కలూరిపాడు. 207 పూర్వం కృతయుగ మందు బలిచక్రవత్తికా గురు కటాక్షం వల్లను బలవంతుడై దేవేంద్రుని ఫలాయనంచేశి అమరావతిపట్నం తీస్కుని త్రిలోక్య సాంభ్రాజ్య దురంధరుడై రాజ్యం చేస్తూవుంన్న యడల యింద్రాదులు మొదలయిన దేవతలు వెళ్ళి, విష్ణువును గురించ్చి మొదలుబెట్టినంద్ను యింద్రాఢణమై విష్ణు త్రివిక్రమావతారం దాల్చి బలిచక్రవర్తిని మూడు అడుగులు భూమి ధానం ఆడ్డి ధారాగ్రహితం చేయించుకొని విశ్వరూపం ధరించి త్రిలోక ములు ఆక్రమించ్చి బలిని రసాతలగతుని చేశి యిందునికి త్రిలోకాధిపత్యము పు హాయిచ్చిరి గనుక దేవేందుడు త్రివిక్రమ స్వామి వారిని ప్రతిష్ఠ చేశినారు. స్వామివున్న పయికం శ్లో॥ ఛత్రం భూ 11 వహంత్రం రవిశశి యుగళం నారదం రుష్యశృంగ్గం రాహగ్రస్తోఢ్వ పాడం | సృకం కర జలక్షాళితం బ్రంహ్మణే | ఏకం ప్రహ్లాద యుక్తం బయమపద పాఠ్వేరా శుక్ల వి:ధ్యావళీనాం | తాక్షేణ్యవకారమేత మడగజ విజయంత్రి విక్రమ మూత్తికాం నమామి | (శ్లో॥ ఛత్రం మూరే వహంతం 11 రవిశశియుగళం, నారదం, రుష్యశృంగం : రాహుగ్రస్థోర్వ పాదం స్వకర సుర జల ణాళితం బ్రహ్మణాచ | ఏకం ప్రహ్లావ యుక్తం బలిపద పార్శ్వే శుక్ల వింధ్యా వశీనాం ! తార్యే వక్రార మేతే మదగజ విజయం త్రివిక్రమ మూర్తిం నమామి 1) (తా॥ తలపై గొడుగును ధరించినట్టియు, సూర్యచంద్రుల జంటలయు, నారద ఋష్య శృంగ మహర్షులతో గూడినట్టియు, బ్రహ్మదేవుని స్వీయకరములచే కడుగబడినట్టియు, బలి చక్రవర్తి ప్రక్కననున్న అతని భార్య వింధ్యావళితో గూడి పూజింపబడినదియు ఏక పాదము ప్రహ్లాదునితో గూడినదనియు, ఒక పాదము గరుకుని యందుంచబడినదియునగు ఆ గజేంద్ర త్రాణుని త్రివిక్రమ మూర్తిని నమస్కరించుచున్నాను.)