పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

199 సరికొండ పాళెం కైఫీయతు కైఫీయతు మౌజే సరికొండ్డ పాళెం పరగణే వినుకొండ్డ ముప్పాతికె స్న౧౨౨ (1817 AD) ఫసలీ యీశ్వర నామ సంవత్సర ఫాల్గుణ శు౧౦లు మజ్కూరి కరణాలు కుడుముల బుచ్చిరాజు చిన రామున్న వ్రాయించినది. పూర్వం గ్రామ నిర్మాణం చేశేటప్పుడు యీ స్థళానికి దక్షిణంగ్గా వుండే కొండ నామధేయం చేత గ్రామ నిర్మాణం చేశినందువల్ల సరికొండ పాళెం అనే నామం ప్రసిద్ధి అయినది. కలియుగా సంతరం యుధీష్టర విక్రమ శకంబ్బులు జర్గిన మీదట శాలివాహన శక ప్రవేశమయిన మీదట కొంన్ని సంవత్సరములకు యీ దేశానికి గజపతి అశ్వపతి, నరపతి అనేవి మూడు సింహ్వాసనాలు యేప౯డ్డవి. యిందులో గజపతి సింహ్వాసనస్తుడయిన విశ్వంభర దేవు ప్రబలుడయి పన్నెండ్లు సంవత్సరములు ప్రభుత్వం చేసిన మీదట యితని కొమారుడయిన గణపతి దేవ మహారాజులుంగ్గారు పట్టాభిషిక్తుడయి రాజ్యం శేయుచుండగాను వీరి వద్ద వుండే మహా ప్రధానులయిన గోపరాజు రామంన్న గారు శాలివాహన శకం ౧౬ (1145 AD) అగు నేటి రక్తాక్షినామ సంవత్సర భాద్రపద బ 30 అంగారక వారం సూర్యోపరాగ పుణ్యకాలమందున ప్రభువు దగ్గిర దానం పట్టి సమ స్తమయిన నియ్యోగులకు గ్రామ కరణీకపు మిరాశీలు నిన్న యించ్చే యెడల యీ గ్రామానికి వశిష్ట సగోత్రు లయిన అశ్వలాయన సూతులయిన నార పరాజు అనే నందవరీకికి యేకభోగంగ్గా మిరాశీ యిచ్చినారు. గనుక తదారభ్య యేతద్వంశజులయినవారు మిరాశీ అనుభవిస్తూ వుంన్నారు. శాలివాహనం శకం ౧౫౦౦ (157d AD) వరకు వడ్డెరెడ్డి కన్నాటక ప్రభుత్వం జర్గిన మీదట మొగలాయి ప్రభుత్వం వచ్చెను గనుక యీ శీమ మల్కీ విభుకాం పాదుశహా వారు దేశం ఆక్రమించ్చుకొని పరగణాలు సంత్తు బ:ద్దీలు నిన్న కొయించ్చే యెడల యీ గ్రామం వినుకొఁద్ద పరగణాలో దాఖలు చేసి పరగణా దేశ పాండ్యాలు అమీళ్ళపరంగా ఆమానీ మామియ్యతు జరిగించుకొంటూ వచ్చినారు తదనంతరం రామరాజు వారు అనేవారు యీ పరగణాకు జమీ ప్రభుత్వం చేస్తూ వుండగా మరికొన్ని దినములకు మలరాజు వారు ప్రబలులయి లోవయినంవున్న రామరాజు వారిని సాధించ్చి యీ పరగణాకు జమీ సంపాక్షించ్చుకొని ప్రభుత్వం చేస్తూ మలరాజు పెదసూరంన్న గారి యీ పరగణాలో దేశపాండ్యాలు అయిన భాస్కరుని బల రామన్నగారికి మనోవర్తి క్రింద యిచ్చినారు గనుక తదారథ్యం వీరి వంశస్తులయినవారు అనుభవిస్తూ వుంన్నారు. పెదసూరన్నగారి ప్రభుత్వం జర్గిన మీదట యితని కొమారుడయిన పెద రామారాయినింగ్గారు జమీ ప్రభుత్వం చేస్తూ వుండి వీరికి సంత్తు లేనందువల్ల దాయాది అయిన నీలాద్రి రాయనింగ్గారు జమీ ప్రభుత్వం ఆక్రమించ్చుకొని వీరుున్ను వీరి దాయాదు