పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

197 శావల్యాపురం కైఫీయతు కైఫీయతు మవుజే శావల్యాపురం పరగణే వినుకొండ ముప్పాతిక వంట్టు యీలాఖే వాసిరెడ్డి జగ్గంన్నాధబాబు స్న (1917 AD) ఫసలీ యీశ్వర నామ సంవత్సర ఫాల్గుణ శు ౧౦ లు మజ్కూరి కరణాలు చింతకుంట్ట సూరయ్య రామయ్య, వ్రాయించినది. పూర్వం యీ గ్రామానికి పులుకూటిపాడు అనే నామధేయం వుండగా కొంన్నాళ్ళకు గజపతి, అశ్వపతి, నరపతి అనేవి మూడు సింహ్వాసనాలు వుండగా యిందులో గజపతి సింహ్వాస న స్టుడైన విశ్వంభరదేవు కుమారుడు గణపతిదేవ మహారాజులుఁగారు తక్తు బిఠాయించ్చి పృథ్వీ సాంబ్రాంజ్యం శేయుచుండగాను వీరివద్ద వుండే మహా ప్రధానులయిన గోపరాజు రామున్న గారు శాలి వాహన శకమందు ౧౦౬౭ (1145 AD) శకములో ప్రభువు దగ్గిర దానం పట్టి సమస్తమయిన నియ్యోగులకు గ్రామకరణీకపు మిరాశీలు నిన్న కొయించ్చే యెడల L C గ్రామానికి సామంతపూడి వారు అనే ఆరువేల నియ్యోగులకు మిరాశీ యిచ్చినారు గనుక తధారభ్యం వీరి వంశస్థులు కన్నాటక ప్రభుత్వ పర్యంతం అనుభవిస్తూ వచ్చినారు. తదనంతరం వారు ఖిలపడిపోయినందున పరగణా దేశ పాండ్యాలు అయిన భాస్కరుని వారుంన్ను గుంటుపల్లి వారుంన్ను మిరాశీ తమపరం చేసుకొని అనుభవిస్తూ పుడ్డి మరి కొంన్ని దినములకు శంతస్స గోత్రులున్ను ఆశ్వలాయన సూత్రులయిన చింత్తకుంట పద్మనాభుడు అనే సంద వరికికి తమ చిన్నదాన్ని యిచ్చి వివాహం చేశి దహోత్రభాగం చేత నా గ్రామ మిరాశీ యిచ్చినారు గనుక తదారథ్యం యేతద్వంశజులయినవారు మిరాశీ అనుభవిస్తూ యీ వుంన్నారు. తదనంతరం మొగలాయి ప్రభుత్వం వచ్చె గనుక మల్కీ విభురాం పాదుషాహావారు డక్కం పాదే (దుష ) భే సుభాకు అధికారులై యీ దేశానకు వచ్చి కన్నాటక పాదుషాహా అయిన శ్రీ రంగ్గరాయలును జయించ్చి దేశం ఆక్రమించుకొని పరగణా దేశపాండ్యాలు అమీళ్ల పరంగా అమానీ మామ్లియ్యతు ఉగ్గించ్చుకొంటూ వచ్చినారు. తదనంతరం రామరాజు వారు యీ పరగణాకు జమీ లెచ్చుకొని ప్రభుత్వం చేసిన మీదట మలరాజు పెదరామారాయనింగ్గారు యీ పరగణాకు జమీ తెచ్చుకొని ప్రభుత్వం చేస్తూ సర్కారు పయికం విస్తరించి బాకీ వుండ్డి వాసిరెడ్డి చంద్రమౌళి గారికి Cూ పరగణాలో పాతిక వంట్టు గ్రామాదులు ఖరీదుకు యిచ్చినారు గనుక అప్పట్లో యీ గ్రామం పాతిక వంట్టులో దాఖలు అయి తదారభ్య వాసిరెడ్డి చంద్రమౌళిగారు, పెదరామలింగన్నగారు పెద నర్సంన్నగారు, సూరంన్నగారు, చిన నర్సంన్నగారు, చిన రామలిఁగ్గంన్నగారు, జలగ్గంన్న గారు, రామున్నగారు ప్రభుత్వం చేసినమీదట రాజావాసిరెడ్డి వెంక్కటాద్రినాయుడు బహదరు మన్నె సులతానుగారు ప్రభుత్వం చేసిన మీదట యీయన కొమారుడైన జగన్నాధబాబు గారు ప్రభుత్వం చేస్తూ పుంన్నారు. మొగలాయి ప్రభుత్వంలో ఇభరాం పాదుషాహా యీ గ్రామం........ అనే భోగము యీ దానికి మరునత్తిజా కింద యిచ్చినారు గనుక అప్పట్లో యీ గ్రామం బస్తీ తప్పి ఖిలపడివుండగా