పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శానం వూడి మీదట శ్రీ రంగ్గరాయలు ప్రభుత్వం చేస్తూ వుండగా మొగలాయి ప్రభుత్వం వచ్చెను గనుక యీ సీమకు మల్కీ ఇభురాం పాదుషహా వారు శ్రీ రంగరాయలును జయించి యీ దేశం ఆక్రమించుకొని దేశపాండ్యాలు అమీళ్ల పరంగా పరగణా అమానీ మామియ్యతు జరిగించుకొంటూ వచ్చినారు. తదనంతరం యీ పరగణాకు రామరాజు తమ జమీ ప్రభుత్వం తెచ్చుకొని ప్రభుత్వం చేసిన మీదట మలరాజు పెద సూరన్న గారు రామారాయనింగారు ప్రబలులయి యీ పరగణాకు జమీ తెచ్చుకొని ప్రభుత్వం చేస్తూన్ను సర్కారుకు విస్తరించి, పయికం బాకీ వుండి యీ పరగణాలో పాతిక వంట్టు గ్రామాదులు వాసిరెడ్డి చంద్రమౌళి గారికి విక్రయించినారు. గనుక అప్పల్లో యీ గ్రామం పాతిక వంట్టు కలసినది గనుక దాఖలు అయి తధారథ్యం వాసిరెడ్డి చంద్రమౌళిగారు పెద్దరామలింగ్గన్న గారు పెదనర్సన్నగారు, సూరన్నగారు, చిన్న నర్సన్నగారు, చిన్నరామలింగన్నగారు, జగ్గన్నగారు, రామన్నగారు ప్రభుత్వం చేసిన మీదట రాజా వాసిరెడ్డి వెంక్కటాద్రి నాయుడు బహదరు మన్నె సులతాను ప్రభుత్వం చేసిన మీదట రాజా జగన్నాథ బాబుగారు ప్రభుత్వం చేస్తూ వున్నారు. 196 గ్రామానికి నైరుతిన ఆంజనేయ స్వామివారి దేవాలయం శనివారం రోజున నైవేద్య దీపా రాధనలు జరుగుతూ వున్నవి. పూర్వం వాసా రామయ్య చేసిన ప్రతిష్ఠ. శ్రీ చెన్న కేశవ స్వామి వారి దేవాలయం ఖిల పడిపోయినది. C గ్రామం మిరాశీదారులైయిన శానంపూడి ఆచార్యులు చేసిన ప్రతిష్ఠ చోళ ప్రతిష్ఠ. మజ్కూరి కరణాలు - శాస్త్రంపూడి కోటమరాజు అనుమతిన - అయ్యప్ప వ్రాలు.