పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

195 శానంపూడి కై ఫీయతు కైఫీయతు మౌజే శానంపూడి పరగణే వినుకొఁడ్డ వంట్టు పాతికె స ౧౨౨౭ (1817 A.D) ఫసలీ యిలాఖే రాజా వాశిరెడ్డి జగన్నాథ బాబు యీశ్వర నామ సంవత్సర పాల్గుణ శుద్ధ ౧౧ బుధవారము మజ్కూరి కరణం శానంపూడి కోటమరాజు వ్రాయించినది. పూర్వం పెదకంచల౯లలో కృష్ణ గంధర్వుడనే రాజు వుండగా పల్నాటి సీమలో వుండే శీలం బ్రహ్మనాయుడు అనే వెలమ వారి తమ్ముడు అన్న పెద్దన్న అనే అతను కంచలకు వచ్చి యీ రాజు కుమార్తెను పెండ్లాడిన మీదట కొన్ని దినాలకు యితను వెలమవాడు అని c రాజుకు తెలిసి చంప వలెనని ప్రయత్నం చేసేటప్పుడు యీ రాజు దగ్గిర పూర్వం దేవలోకం నుంచి వచ్చిన అశ్వము వుండగా యీ రాజు యోచన చేసిన దేమంటే, మన చిన్నది యిక్కడ వుండగా యితన్ని ప్రత్యక్షముగా చంపుట యుక్తము కాదనిన్ని యీ దేవాశ్వము మీద యితణ్ణి యెక్కించి నంతలో ఆశ్వము బహు వాయువేగము చేత యితణ్ణి పల్నాటికి తీసుకొని పోయినది. అప్పుడు యితడు దృఢ చిత్తుడయినందువల్లనున్ను, శక్తివంతుడయినందువల్లనున్ను యీ గుర్రాన్ని సంభాళించు కొనిపోయి యీ వృత్తాంత మంతా తన వారితో యావత్తు తెలియచేసి, తమ వారిని తిరిగి యావత్తు కూర్చుకొని తన భార్యను తీసుకొని పోయె నిమిత్తమై యీ స్థలానికి వచ్చి, కంచర్లకు వుత్తరముగా రెండు వర్గుల దూరాన పరివారముతో మకాంచేసి రాజుకు వర్తమానం చెప్పి, అంపించి నంతలో యీరాజు కోపాగ్ని తప్తుడై, యుద్ధ సంన్నద్ధుడై యీ స్థలానికి రాగా, యిక్కడ వుభయుల శేనం కూడి నందువల్ల c గ్రామానికి శానంపూడి అనే నామాంక్కితం వచ్చినది. తదనంతరం గజపతి సింహ్వాసనస్థుడయిన గణపతి దేవ మహారాజులుఁగ్గారు పృథ్వీ సామ్రాజ్యము వహించి ప్రతి పాలన చేస్తూ వుండగా వీరివద్ద వుండే మహా ప్రధానులయిన గోపరాజు రామన్న గారు శాలివాహనశక వరుషంబ్బులు అగునేటి రక్తాక్షి నామ సంవత్సర భాద్రపద బ॥ ౩౦ అంగారకవారం (మంగళవారం) సూర్యో పరాగ మహా పర్వ పుణ్య కాలమందున ప్రభువుదగ్గిర దానంపట్టి సమస్తమయిన నియ్యోగులకు గ్రామకరణీకపు మిరాశీలు నిర్ణయించ్చే యెడల యీ గ్రామానికి ఆత్రేయ సగోత్రులున్ను అశ్వలాయన సూత్రులయిన కలకోట కృష్ణమ రాజు అనే నందవరీకికి అష్ట భోగ సహితముగా మిరాశీ యిచ్చినారు. గనుక తదారభ్యం తత్సంతతి వారు మిరాశీ అనుభవిస్తూ వున్నారు. తదనంతరం హనుమకొండ సింహ్వాస నాధీశ్వరు డయిన ప్రతాప రుద్రదేవ మహారాజులుంగారి ప్రభుత్వం శాలివాహన శకం ౧౩౪౨ (1420 AD) వరకు జరిగిన మీదట రెడ్లు ప్రబలులయి శాలివాహన శకం ౧౩౪౨ (1420 AD) సంవత్సరము వరకు ప్రభుత్వం చేసినారు. తదనంతరం గజపతులు దేశం ఆక్రమించుకొని ప్రభుత్వం చేస్తూ వుండగా కర్ణాటకాధీశ్వరుడైన కృష్ణదేవ మహారాయులుంగారు విజయనగర మందున రత్న సింహ్వా సనారూఢులై ప్రభుత్వం చేస్తూ పైన వ్రాసిన గజపతివారిని సాధించి దేశం ఆక్రమించుకొని ప్రభుత్వం చేసిన మీదట అచ్యుతరాయలు, రామరాయలు, సదాశివరాయలు, తిరుమలరాయలు ప్రభుత్వం చేసిన