పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14

కసువుకుర్రు

కైఫియ్యతు మౌజే గడుపుకుర్రు సంతు పొంన్నూరు తాలూకె చిల్కలూరుపాడు

సర్కారు ముతు జాంన్నగరు రాజామానూరు వెంక్కట కృష్ణారావు.

పూర్వం యీ స్తలమంద్దు విస్తరించి కసువు వుండ్లు గన్కు యిక్కడ గ్రామం యేప౯డి కసువు కుర్రు అనే వాడికె వచ్నిది. చాణుక్య వంశీకుడయ్ని విష్ణువధ౯న మహారాజుంగారు రాజమహేంద్రవరం రాజధానిగా వశియించ్చి రాజ్యం చేశేటప్పుడు యిక్షుపురి ప్రతి నామ దేయమయ్ని చెర్కూకు త్రివిక్రమ స్వామి వార్కి యీ కసువు కుర్రు అగ్రహారంగ్గా ధారాగ్రహితం చేశ్ని వారై తదనంత్తరం యీ స్తలమంద్ను విష్ణు స్తలం కట్టించ్చి శ్రీ వేణు గోపాల స్వామి వార్ని ప్రతిష్ఠ చేశి నిత్య నైవేద్య దీపారాధనలు మొదలయ్ని వుత్సవాదులు విశేషములుగా జర్గించినారు.

యిది కలియుగ ప్రవేశమైన తర్వాతను యుదిష్టి శక మంద్దు ౧౮౨౬ (1904 AD) సంవ్వత్సరమంద్ధు జర్గిన క్రమము.

విక్రమశక మతిక్రమించ్చి శాలివాహన శక ప్రవేశ మయ్ని తర్వాతను యేత ఛకగత వత్సరంబ్బులు ౧౦౫౫ (1138 AD) జర్గిన మీదట గజపతి విశ్వంభర ప్రభువు కొమారు డయ్ని గణపతి దేవ మహారాజు శాలివాహనం ౧౦౫౬ (1134 AD) మంద్దు పట్టాభిషిక్తుడై రాజ్యం చేశేటప్పుడు వీరి మహ ప్రధానులయ్ని గోపరాజు రామన్న గారు సమస్తమయ్ని నియ్యోగులకు శాలీవాహనం ౧౦౬ఽ శక (1145 AD) మంద్దు గ్రామ కరిణీకపు మిరాశీలు నిన్న౯యించ్చే. యడల యీ గ్రామాన్కు వెలనాడు పరాశర గోతృడయ్ని యండ్డవల్లి సాంబ్బ శివున్కి ఏక భోగంగ్గాను మిరాశీ నిన్న౯యించ్చినారు గన్కు తదారఖ్యా యేత ద్వంశజులైనవారు చింత్తలపూడివారు అనే అభివాదం చాతను అనుభవిస్తూ వున్నారు.

శాలీవాహనం ౧౨౪౨ శకం (1320 AD) వర్కు అనుమ కొండరాజులు అధికారం చేశ్ని తర్వాతను రెడ్లు ప్రభుత్వం చేస్తూ వుండ్డగా స్వస్తి శ్రీ శాలివాహన శక వరుషంబులు ౧౩_౨౫ (1408 AD) అగునేటి తారణ సంవత్సర పుష్య బహుళ 30లు సూర్యగ్రహణ పుణ్యకాలమంద్దు కోమటి వేమారెడ్డింగారు తుంగ్గభదావతి తీరాన్కు స్నానాధ౯మై వచ్చి యీ గ్రామం పుసహా చర్కూరు త్రివిక్రయ స్వామి వార్కి అగ్రహారంయిచ్చి మజ్కురిలో వున్న వేణుగోపాలస్వామి వారి ఆలయమంటపములు మొదలయ్నివి కట్టించి నిత్యోత్స వమలు మొదలయ్నివి విశేషముగా జర్గెటట్టుగా కట్టడి చేశినారు గనక్క ఒడ్డెరెడ్డి కన్నా౯ట్క ప్రభుతము శాలివాహనం ౧౫౦౦ శకం (1578 ఆడ్) వర్కు జర్జెను.