పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కసువుకుర్రు

15


అంత్తట మొగలాయి ప్రభుత్వము వచ్చె గన్కు అప్పట్లో క్షామడాంబ్బరములు చాతను దేవస్తానాన్కు అచ౯నాదులు జర్గకపోయను. మొగలాయి దొరలు సర్కారు సముతు బంద్దీలు చేసేటప్పుడు యీ గ్రామం పొంన్నూరు సముతులో దాఖలు చేసి సముతు అమీలు చౌదరు దేశ పాండ్యాలపరంగ్గా ఆమాని మామ్లియ్యతు జరిగించ్చినారు.

స్న ౧౧౨౨ ఫసలీ (1712 AD)లో సుభావారు కొండ్డవీటి శీమ జమీదాల౯కు పంచ్చిపెట్టె యడల యీ గ్రామం సర్కారు మజ్ముదారులు అయ్ని మానూరి వెంక్కన్న పంత్తులు గారి వంట్టులో వచ్చి చిల్కలూరి పాటి తాలూకాలో దాఖలయ్నిది గన్కు వెంక్కన్న పంత్తులు అప్పాజి పంత్తులు వెంక్కట్రాయినింగారు వెంక్కట కృష్ణునింగారు ప్రభుత్వం చేశ్ని తర్వాతను వెంక్కటకృష్ణునింగారి కొమారులయ్ని నర్సంన్నారావు గారి ప్రభుత్వంలో మజ్కూరి మిరాశీదారుడైన చింత్తలపూడి భగవానులు నరసరాజు పూర్వం విష్ణు కధ౯న మహారాజు ప్రతిష్ఠచేశ్ని వేణు గోపాలస్వామి వార్కి పునహా దేవాలయం కట్టించి స్న ౧౨౧౮ ఫసలీ (1808 AD) శుక్ల నామ సంవత్సర జ్యేష్ఠ శు ౨ లు రోజున పునః ప్రతిష్ఠ చేశిరి గన్కు శ్రీ స్వామి వార్కి నిత్య నైవేద్య దీపారాధనలు జర్గ గలంద్లుకు కు ౦౻౦ ముప్పాతికె భూమి యినాము యిప్పించ్చినారు. స్న ౧౨౧లా ఫసలీ (1809 AD) వర్కు నరసన్నారావు గారు ప్రభుత్వం చేసినారు.

తదనంతరం సదరహి ఫసలీలో వెంక్కట కృష్ణునింగారు ప్రభుత్వాస్కు వచ్చి యీ వర్కు ప్రభుత్వం చేస్తూ వున్నారు.

రిమార్కు గ్రామ గుడి కట్టు
కుచ్చళ్లు ౨౪ కి మ్నిహలు —
౦ ౺ ౦ గ్రామ కంఠం
౦ ౹ ౦ మాలపాడు
౦ ౹ ౦ చెరుపు కుంట్టలు ౨కి
౦ ఽ = చజ్కుల భావప్ప చెరువు ౧ కి
౦ ఽ = నాగలింగ్డం చరువు ౧ కి
౦ ౹ ౦ తోటలు ౨ కి.
౦ ఽ = వెలగతోట వంకి
౦ ఽ - చింత్తతోట వ ౧ కి
౦ ౻ ౦ డొక్కలు ౪ కి
౦ ౻ ౦ తు.....ద్రధం కొడుమూడు వైపులు
౪ ౻ ౦ యినాములు