పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

193 విఠంరాజుపల్లె కైయిఫియ్యతు మపుంజె విఠంరాజు పల్లె వర్గణె వినుకొండ ముప్పాతికె వంట్టు జమీదారు మల్రాజు వెంక్కట గుండ్డారావు ౧౨౨౮ ఫసలీ (1818 AD) ది మాచికా ఆ. న౧౮౧౯ (1819 AD) సంవ్వత్సరము. బహుధాన్య నామసంవ్వత్సరం బ 3 ఆదివారం సర్కారు ముత్తు జాంన్నగరు సర్కారు జిల్లా గుంటూరు. వినుకొండ గ్రామము పొలములో యీశాన్య భాగమంద్ను పదహారు బాలజా పగ్గానకుచ్చళ్ల ౬౪ ఆరవై నాల్గు కుంటలు ప్రాప్తి అయ్ని కుచ్చళ్ళు 30 ముప్పయి కుచ్చళ్ళ పొలఁ హైదరాబాదా రాజధాని యందు తానీషా పాదుషాహా వారు ప్రభుత్వం చేస్తూ వుండే కాలమందు వినుకొండ్డ పర్గణాకు దేశపాండ్యా అయ్ని భాస్కరుని కొఁడ్డప్పగార్కి సదరహి పొలం సదరహి పాదుషాహా వారు సర్వ మాన్యముగా దయ చేయించ్చినారు. గన్కు ఆ సమయాన రామరాజు ఆయ్యప్పరాజు అనే ఆరువేల నియ్యోగి బ్రాంహ్మడు గుర్రం కొండసీమ నుంచి కుటుంబ సమేతంగా వచ్చివినుకొండ్డలో కాపురం వుండే రాయని భాన్కరు వానిజాన్నీ గుంటుపల్లి ముత్తరాజు అయ్యవాని అనుసరించ్చి వుండగా సదరు దేశపాండ్యాలు తమకు యిచ్చిన సర్వమాన్యపు పొలాన్కు కరణీకం మీరాశినినినయించినారు. గన్కు గౌతమ సగోత్రోద్భవులయ్ని యజుశ్మాఖాధ్యాయులయ్ని రామ రాజు అయ్యప్పరాజు అనే ఆరు వేల నియోగి బ్రాంహ్మణినికి కరణీకపు మిరాశి ధారాగ్రహితం చేసి యిచ్చినారు గన్కు సదరహి అయ్యప్పరాజు కొంన్ని సంవత్సరములు మిరాశి అనుభవిస్తూ బ్రతికి వుండి మరికొంన్నాళ్ళకు చనిపోయిన తదనంతరం C అయ్యప్పరాజు కొమారుడైన విఠంరాజు అనే కరణం సదరు పొలములో గ్రామం నూతనంగా యేర్పాటుచేశి ఆ గ్రామాన్కు తన పేర (?) విఠంరాజుపల్లె అని ప్రశస్తం చేసినాడు. గన్కు యిప్పటికింన్ని లేఖల్లో అదేపేరు ప్రశ స్తంగా వ్రాస్తూ వున్నారు. యీ గ్రామాన్కు సమీపాన పశ్చిమ భాగమందు వినుకొండ నుంచ్చి కొండవీటికి పొయ్యేరహదారిలో సదరహిఅగ్రహరీకులయ్ని దేశపాండ్యాలు చలివేంద్ర మంటపం రాతితో కట్టించి వచ్చే పోయ్యె మార్గస్తుల్కు వుదకం పరామృకే (సరఫరా చేయిస్తూవుండే గన్కు అది చలివేంద్ర మంట్టపం అని యిప్పటికింన్ని ప్రశస్తంగా వుండి వుంన్నది. ఆ మంటపాన్కు నూరు సంవత్స రములప్పటికి ఆవుతూ వున్నది. యీ గ్రామాన్కు తూపు భాగాన గ్రామకరణం అయి రామ రాజు సంజీవప్ప వేయించ్చిన చెరువు వకటి యీ చెరువు క్రిందను వడ్లు తమిదెలు పంట పండుతూ వుండ్డి అతి వరషాల చాతను చెరువు తెగి యిప్పటికి 30 సంవత్సరములు ఆపుతూవుంన్నది. ఇప్పుడు చెరువు క్రింద మాగాణి లేదు. ఈ గ్రామన్కు వుత్తర భాగాన పీచికల పాలెం కుంన్నూ మజుకూరు కుంన్ను షరాకతు పొలంలో వినుకొండ కాపురస్తుడైన వినుకొండ శీమకు షరాఫుగా వుంన్న దొడ్డా 24) ౦ వకటి యింటికి