పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వడ్డెం గుంట వగయిరా గ్రామాలు నాయుడు బహద్దరు మంన్నెసులతాను గారు ప్రభుత్వం చేసిన మీదట యీయన కొమారుడయిన వాసిరెడ్డి జగన్నాధ బాబుగారు ప్రభుత్వం చేస్తూ వుంన్నారు. 192 దేవాలయాల వివరాలు : వడ్డెగుంట గ్రామంలో యీ గ్రామ మధ్యమఁద్దు ఆఁజ్జనేయస్వామి వారి గుడి వున్నది. యిడి పూర్వం మలరాజు వారి శేవకుడు అయిన మడుగుల రామలిఁగ్గం అనే అతను ఆలయం కట్టి ప్రతిష్ట చేసినది. యిప్పుడు కుచ్చల మాన్యం జరుగుతూ వుంన్నది. ౧ వూరికి దక్షిణాన కాళహస్తీశ్వరుడి దేవాలయం వుంన్నది. యిది పూర్వం చోళ ప్రతిష్ఠ అని జనులు వాడుకొంటారు. యిందుకు మరేమిన్ని దాఖలా కనుపించలేదు. ఇప్పుడు కుచ్చల అర వీసం మాన్యం జర్గుతూ వున్నది. యీ గ్రామదేవతలయిన పాత పాబిమ్మ, అంకమ్మ కు యేటా శిడి మాన్యాలకు అరకుచ్చల మాన్యం జరుగుతున్నది. పెరూరి పాడు గ్రామములో గ్రామానికి దక్షిణం కొండమీద త్రిపురాంతకేశ్వరస్వామి వారి దేవాలయం వున్నది. పూర్వం కొప్పసాని, దొఁడ్డసాని, నిమ్మసాని యీ ముగ్గురున్ను యీ ప్రాంతమందు పుండె ప్రతి నిత్యము దూపాటిశీమలో చేరిన త్రిపురాంతకేశ్వరుడి దసనానకు పోతూ వస్తూ ఒకనాటి సమయమందున వీరి మీద కరుణించ్చి స్వామివారు మీరెందుకు కష్టపడి యింత దూరం వస్తారు. నేనే అక్కడికి వచ్చి వెలుస్తాను అని చెప్పి అదే ప్రకారం స్వామివారు స్వయం వ్యక్తముగా యీ గ్రామానికి దక్షిణం కొండ్డ మీద ఆ విభవించ్చినందువల్ల సదరహీ భోగం వారిఁడ్లు ప్రతిష్ట చేసినారు. ఇప్పుడు నిత్య నైవేద్య దీపారాధనలకు కుచ్చల మాన్యం జర్గుతూవుంన్నది. నాయుని పాళెంలో :- ఆంజ్జనేయుల మంటపం వున్నది. నిత్య నైవేద్య దీపారాధనలకు ఆర కుచ్చల మాన్యం జర్గుతూ వున్నది. కనుమల చెర్వులో :- ౧ గ్రామ మధ్య మంద్దు ఆంజనేయుల దేవాలయం వుంన్నది. ఇది పూర్వం మజ్కూరి మిరాశీ దాల్లేజా ప్రతిష్ట చేసినది. ఇప్పుడు అరకుచ్చల మాన్యం నిత్య నైవేద్య దీపారాధనలకు జరుగుతూ వుంన్నది. దీనికి సమీపమంద్దు పోలేరమ్మ, బంగ్గారమ్మ గుండ్లు వుఁన్నవి. వీటికి అర కుచ్చల మాన్యం జర్గుతుంన్నది. కుడుమల బుచ్చిరాజు చిన రామన్న వ్రాలు, రామన్న గోపాళయ వ్రాలు, కడుమల నరసరాజు, చిన రామన్న వ్రాలు, నరసరాజు వ్రాలు, చిన రామన్న వ్రాలు.