పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

191 వడ్డెంగుంట్ట, పేరూరిపాడు, నాయునిపాళెం, కనుమలచెర్వు గ్రామాదుల కై ఫీయతు కైఫీయ్యతు మౌజే వడ్డెం గుంట్ట పేరూరిపాడు, నాయుని పాళెు, కనుమల చెర్వు, యిలాభే వాశిరెడ్డి జగన్నాధబాబు స్న (1817 A D ) ఫసలీ యీశ్వర నామ సంవత్సర ఫాల్గుణ కు ౫ లు మజ్కూరి కరణాలు కుడుమల పెదనర్సరాజు చిన రామున్న బచ్చిరాజు రామున్న పాపరాజు వ్రాయించినది. పూర్వం నుంచ్చి యీ గ్రామానకు పూర్వ నామధేయాల చాతనే వాడుకగా పుడ్డగా యీ దేశానకు మూడు సింహాసనాలు యేర్పడ్డవి యిందులో గజపతి సింహ్వాసనస్థుడయిన గణపతి దేవ మహారాజు లుంగ్గారు తఖ్తు బిఠాయించుకొని ప్రభుత్వం చేస్తూ వుండగా వీరి వద్ద వుండే మహా ప్రధానులయిన గోపరాజు రామంన్నగారు శాలివాహన శకం ౧౦౬ (1149 A.D.) శకముద్ధు ప్రభువు దగ్గిర దానంపట్టి సమస్తమయిన నియ్యోగులకు గ్రామకరణీ పు మిరాశీలు నిన్న యించ్చే యెడల యీ గ్రామాలకు వశిష్ఠ సగోత్రులయిన ఆశ్వలాయన సూత్రులయిన నారాపరాజు అనే నుద్దవరీకికి రస్మి తేజో పాజుకొనలతో కూడా మిరాశీ యిచ్చినారు. గనుక తదారథ్యం యేతద్వంశ జులయిన వారు మిరాశీ అనుభవిస్తూ వుంన్నారు. తదనంతరం కోట భీమరాజు దేశం ఆక్రమించ్చు కొన్ని ప్రభుత్వం చేస్తూ వుండగా చోళ దేశాధీశ్వరుండయిన కులోత్తుంగ గొంక్క చోళ మహా రాజులుంగ్గారు యీ దేశానికి వచ్చి భీమరాజును హతించ్చి దేశం పరిపాలన చేసినమీదట అనువకొండ సింహ్వాసనాధీశ్వరుఁడయిన ప్రతాపరుద్ర దేవ మహారాజుల ప్రభుత్వం శాలివాహన శకం ౧౨౨ (1320 AD) శకం వరకూ జర్గిన మీదట రెడ్ల ప్రభుత్వం శాలివాహనం ౧౩౪౨ (1420 AD) శకం వరకూ జరిగిన మీదట కన్నాటక ప్రభుత్వం వచ్చెను గనుక శాలివాహక శకం ౧౫౦౦ (1578 A.D) శకం వరకు వడ్డెరెడ్డి కన్నాటక ప్రభుత్వం జర్గిన మీదట మొగలాయి ప్రభుత్వం వచ్చెను గనుక మలికీ విభురాం పాదుషహా వారు దేశం ఆక్రమించ్చుకొని సంత్తు బందీ పరగణాలు నిన్న్యించ్చేటప్పుడు యీ పేట వినుకొండ్డ పరగణాలో దాఖలు చేసి పరగణా దేశపాండ్యాలు అమీళ్ల పరంగా ఆమానీ మామియ్యతు జర్గించ్చుకొంట్టు వుండ్డి తదనంతరం యీ పరగణా రామరాజు వారికిచ్చి వు:డ్డగా రామరాజు పెద రామారాయంగారు ప్రజలుడయి యీ పరగణాకు జమీ సంపా దించ్చికొని అనుభవిస్తూ వుండి యీ పరగణాలో పాతిక వంట్టు గ్రామాదులు వాసిరెడ్డి చంద్రమౌళి గాలికి క్రయదత్తిగా పన్నెండు వేల వరహాలకు యిచ్చినారు గనుక అప్పట్లో C గ్రామాలు విన కొఁడ్డ పరగణా పాతిక వంట్టులో దాఖలు అయి వాసిరెడ్డి చంద్రమౌళి గారు మొదలుకొని వాసి రెడ్డి పెదరామలింగన్న గారు, పేద నర్సంన్నగారు, సూరన్నగారు, చిన నర్సంన్నగారు. చిన రామలింగ్గున్న గారు, జగ్గయ్యగారు ప్రభుత్వం చేసిన మీదట రాజా వాసిరెడ్డి వెంక్కటాద్రి