పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

190 రావులాపురం కైఫీయతు కైఫీయతు మౌజే రావులాపురం ప॥ వినుకొండ ముప్పాతికె వంట్టు యీలాఖె మలరాజు వెంక్కట గుండ్డారావు స్న ౨౨ (1817 AD) ఫసలీ యీశ్వర నామ సంవత్సర ఫాల్గుణ శు ౪ లు మజ్కూరి కరణాలు బీమిరాల అప్పయ్య వ్రాయించినది. పూర్వం ౦౮ స్థళమందు విస్తరించి రావులు వున్నందువల్ల దీనికి రావులాపురం అనే నామాంక్కితం వాడుక ఆయినది. తదనంతరం గజపతి సింహ్వాసనస్థుడయిన గణపతి దేవ మహారాజులుంగ్గా 3 దినాలలో వీరి దగ్గర వుండే మహా ప్రధానులయిన గోపరాజు రామన్నగారు శాలివాహన శకం ౧౦౬R (1145 AD) శకముద్దు ప్రభువు దగ్గర దానం పట్టి సమస్తమయిన నియ్యోగులకు మిరాశీలు నిన్న కొయించ్చే యెడల యీ గ్రామానికి కౌండిన్యసగోత్రులయిన అశ్వలాయన సూత్రులయిన చంన్నమరాజు అనే ఆరువేల నియ్యెగికి యేకభోగంగా మిరాశీ యిచ్చినారు గనుక తదారభ్యం మిరాశీ అనుభవిస్తూ వున్నారు. శాలివాహన శకం ౧౫ (1578 AD) వరకు వడ్డెరెడ్డి కన్నాటక ప్రభుత్వం జర్గిన మీదట మొగలాయి ప్రభుత్వం వచ్చెగనుక లూ సీమ మలికి విభురాం పాదుషహా వారు దేశం ఆక్రమించ్చుకొని పరగణా దేశ పాండ్యాలు పరంగ్గా అమానీ మామ్లియ్యతు జరిగించుకొంటూ వచ్చినారు. తదనంతరం రామరాజు వారికి మొఖాసా క్రింద యిచ్చి వుఁడ్డగా వారు కొన్నాళ్లు అనుభవించిన మీదట మలరాజు రామారాయనింగ్గారు యీ పరగణాకు జ తెచ్చుకొని రామారాయనింగ్గారు కొండల రాయంగ్గారు సూరంన్నగారు చిన్న రామారాయని.. ర నీలాద్రిరాయనింగారు పెంక్కట నృసింహారాయునిఁ గారు పేద గుఁడ్డారాయునింగారు ప్రభుత్వంచేశిన మీదట నర్సింహరాయులింగారి కొమారుడయిన వెక్కట గుండా రాయకంగారు ప్రభుత్వం చేస్తూ వుంన్నారు. లూ గ్రామం కింద వుండేది గోపన పాళెం అనేది వున్నది. లహ గ్రామంలో వుండే దేవాలయా.. : గ్రామానికి నెదతి మూల ఖిలమయిన రామలింగస్వామి వారి దేవాలయం. పూర్వం చోళ ప్రతిష్ట అని వాడుకొంటు ఉన్నారు. గ్రామానికి పడమర ఆంజనేయులు మిద్దె వున్నది. యిప్పుడు కుచ్చల మాన్యం జర్గుతూ వున్నది. యీ గ్రామంలో వుండే గవులు కొండలు : పెడ గవుల కొండ్డ చిన గనుల కొఁడ్డ అనేవి వున్నవి. పూర్వం కన్నాటకములో యిక్కడ విస్తరించి గవులు త్రవ్వి తాంబ్రం కంచ్చు తీశినందుకు దాఖలా పూర్వపు గవులు విస్తరించి వున్నవి. సొరంగాలు తెలుస్తున్నవి. కరణం బీమిరాల అప్పయ్య వ్రాలు