పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

187 యీపూరు కైఫియతు కైఫి ఫియతు మం॥ యీపూరు ప॥ వినుకొండ ముప్పాతికె యిలాభై మలరాజు వెంక్కట గుఁడ్డారావు స్న ల౨౨ ఫసలీ యీశ్వర నామ సంవ్వత్సరం ఫాల్గుణ శు ౧౦లు మజ్కూరి కరణాలు గోపాలుని వెంక్కట నర్సు వ్రాయించినది. పూర్వం యీ స్థలమందు విస్తరించి కంచల్లు వచ్చి సోమ సూర్య వీధులు తీచి వుత్తర దక్షిణంగా ప్యాట(పేట) కట్టుకొని కంచ్చరప్యాట అనే నామాంక్కితం చాత వుంటూపుఁడ్డగా కొంన్ని సంవత్సరములకు యీ కంచల్లు యావత్తు బయలు దేరి కంచ్చి చూడ వలెననే తాత్పర్యం చేత పోయినంతల్లో వీరికి కాంచ్చీ నగరం గొప్పగా తోచినఁదున వీరు యోచన చేసిన దేమంటే మనము కంచ్చి పట్నం గొప్పదనింన్ని చూడడానికి వస్తిమి మన కంచరపేట అంత్తలేదు అని నిల్లక్ష్యం చేత యోచన చేయంగా అప్పుడు వీరు చేసిన యోచన కంచిలో వుండే వీరభద్రుడుంన్ను వూడు చల్ల౯గురప్పనుంన్ను అగ్నిగుండాల తిరుమల దేవుడుంన్ను వనికుఁట్ట వల్లభరాయుడుంన్ను నలుగురుంన్ను విన్నటువంటి వారలయి బ్రాహ్మణ రూపకంగా యీ కంచల్ల వాండ్ల దగ్గరికి వచ్చి మేముంన్ను మీతో కూడా వస్తాము మీరు మాదేశానికి పోయేటప్పుడు మమ్ములను పిలువ వలసినదని ఆలోచన చేసి చెప్పినంత్తలో అందుకు వీరు ఆమోదించ్చి మరికొంన్ని దినాలకు యా కంచల్లుక్ యావత్తు బయలుదేరి తమ దేశానికి వెళ్లవలెనని ప్రయత్నం చేసి యెద్దులు కఁట్లాలు మొదలయినవి వేసుకొని సదర హీచెప్పిన వారిని మరిచిపోయి తల్లికా వెళ్లే సమయముద్దు వీరి యెద్దులు ఆకస్మిక ముగా కదలల్యేక పోయెటప్పటికి అప్పుడు వీరు యీ కంచర్లు వ్యక్తవంతులయి మనవల్ల ఆపచారం వచ్చినది. ఆ బ్రాంహ్మలు మనము పొయ్యేటప్పుడు తంమ్మును పిలువపు) చెప్పియుండిరి గదా అని ఆలోచన చేసి అప్పుడు సదరహీ బ్రాంహ్మలను పేల్లతోటి కూడా పిలిచిటప్పటికి వారు అప్పుడు పలికిన వారయి అప్పుడు యీ నలుగురు దేముండ్లు బ్రాంహ్మణ రూపంగా యేకస్థులయి కంచల్ల వాళ్లతోటి కూడా బయలుదేరి యీ దేశానికి వచ్చి అదృశ్యములు వీరభద్రుడు కంచర పేటలో శివరూపముగా వెలసి ఆవేళ ముఖ్యంగా యీనా పేటలో వుంటే వారికి తన పూర్వోత్తరం సంగతి యావత్తు తెలియచేసి తన పేరిట యిక్కడ గ్రామ నిర్మాణం చేసి తనకు నిత్య నైవేద్య దీపారాధనలు యావత్తు యధావిధిగా జరుపుమని చెప్పినందున వారయి యీ గ్రామానికి వీపూరు అనే నామాంక్కితం వుంచ్చినారు గనుక తదారభ్యం గ్రామానికి వీపూరు అనింన్ని వాడుక అయినది. సదరహి కంచి నుంచి వచ్చి నలుగురు దేముండ్లలోనుంన్ను వీవూరిలో వీరభద్రుడుంన్ను ఆగ్ని గుఁడ్డాల గట్టుమీద తిరుమల దేముడుంన్ను వూడుచల్లలో గురుప్పా నుంన్ను వనికుఁట్టపాటిమీద వల్లభరాయుడుంన్ను యీ చొప్పున నాలుగు స్తలాలలో నలుగురు వెలసినారు. కలియుగానంతరం యుధిష్టర విక్రమ శకంబులు జరిగిన మీదట శాలివాహన శకం ప్రవేశ మయిన తదనంతరం కొంన్ని సంవత్సరములకు యీ దేశానికి గజపతి అశ్వపతి నరపతి అనేవి మూడు సింహ్వాసనాలు యెప్పడ్డవి.