పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

యీపూరు యిందులో గజపతి సింహ్వసనస్థుడయిన విశ్వంభరం దేవుడు ప్రబలుడయి ప్రభుత్వం చేసిన మీదట యితని కొమారుడయిన గణపతి దేవ మహారాజుంగ్గారు ప్రభుత్వం చేస్తూ వుండగా వీరి వద్ద వుండే మహా ప్రధానులయిన గోపరాజు రామున్నగారు శాలివాహన శకం ౧౦౬ శకమందు (1145 AD) ప్రభువు దగ్గిర దానంపట్టి సమస్తమయిన నియ్యోగులకు గ్రామమిరాశీలు నినయించ్చేయెడల యీ గ్రామానికి మాద్గల సగోత్రులయిన ఆపస్తంబ సూత్రులుంన్ను అయిన గోపాలుని సీతారాముడు అనే ఆరువేల నియ్యోగికి యేకభోగంగా మిరాశీ యిచ్చినారు గనుక తదారభ్యం తద్వంశజులయిన వారు మిరాశీ అనుభవిస్తూ వుంన్నారు. శాలివాహనం శకం ౧౫౦౦ (1578 AD) వరకు వడ్డెరెడ్డి కన్నాటక ప్రభుత్వం జరిగిన మిదట మొగలాయి ప్రభుత్వం వచ్చెను. గనుక యీ సీమలోనికి విభురాం పాదుషహా వారు దేశం ఆక్రమించ్చుకొని ఆమాని మాట్లయ్యతు జరిపించ్చుకుంటూ వుండి తదనంతరం రామరాజు వారికి యీ పరగణా అధికారం యిచ్చినారు గనుక వారు కొంన్నాళ్లు అనుభవించిన మీదట మలరాజు పెదరామారాయనింగ్గారు ఈ పరగణాకు జమి సంపాదించుకొని ప్రభుత్వం చేసిన మీదట మలరాజు కొండలరాయనింగారు నీలాద్రి రాయనింగ్గారు, పెద సూరన్న గారు చినరామారాయనిఁగ్గారు, వెంక్కట నరశింహ్వ రాయునింగారు పెద గుండ్డారాయనింగ్గారు ప్రభుత్వం చేసిన మీదట వెంక్కట నరసింహరాయునింగారు కొమారుడయిన వెంకట గుండ్డాగాయు నింగ్గారు ప్రభుత్వం చేస్తూ వున్నారు. 188 ఈ గ్రామంలో వుండే పాళ్యాలు యరపాలెం తూపు పాలెం రాజు పాలెం, చేను ఈ గ్రామఁలో వుఁడే దేవాలయాలు:- గ్రామానికి ఈశాన్య భాగాన వీరభద్రుడి దేవాలయం స్వయం వంక్త స్తలం యిప్పుడు కుచ్చల వెలి పొలముంన్ను తూమెడు విత్తుల వారిమన్ని నిత్య నైవేద్య దీపారాధనలకు జరుగుతూ వున్నది. దీనికి సమీప మందు చీకటి మల్లేశ్వరుడిది ఖిలమయిన దేవాలయం వున్నది. ఇది పూర్వం కాత్త వియ్యాజ్జునుడు (కార్తవీర్యార్జునుడు) ప్రతిష్ట చేసినదట యిప్పుడు ఖిలమైపోయినది, - వూరికి తూపు ఖిలమయిన గోపాలస్వామి దేవాలయముఁన్ను లింగపాన వట్టమున్ను వున్నది. ఇదిన్ని పూర్వం కంచల్లఁ దినాలలో ప్రతిష్ట చేసినది. రిమార్కులు:- పూర్వం ఈ స్థలమందు కంచలుజా విస్తరించ్చి పేట కట్టుకొని ఈ పేటచుట్టు ఇంపాకేల్లు జా కంచల్లుకా వు:టున్ను ఆగ్ని గుండాలు మొదలయిన స్థలాల కొండగనులు చేసి విస్తరించ్చి కంచు తామం చేసేది. రాళ్లు త్రవ్వి తీస్కువచ్చి వూడు కంచల్లకాలో ఈ పూల్లో కొలిమి పెట్టుకొని వున్నందుకు దాఖలా పూర్వపు కొలుములు చిట్టేలు మొదలయిన విస్తరించ్చి అగుపడుతున్నవి. ఆ కంచల్ల వాండ్లు వుండే పాడుబడి విస్తరించి దిన్నెలుగా కండ్ల బడుతున్నవి.