పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

181 గుంట్లపల్లి. గంగువల్లి. జాలకల్లు యొక్క కైఫీయతు కైఫీయతు మౌజే గుంటుపల్లి, గంగ్గుపల్లి, జాలకల్లు పరగణే వినుకొండ్ల పాతికె పంట్టు యిలాఖే వాళిరెడ్డి జగన్నాధ బాబు స్న ౧౨౨ ఫసలీ యీశ్వర నామ సం॥ పాల్గుణ శుళ మజ్కురి కరణాలు దంమ్మవళం నర్సరాజు వ్రాయించ్చినది. పూర్వం నుంచ్చి యీగ్రామాలకు పూర్వనామధేయాల చేతనే కల్గి వుండ్డగా గజపతి శింహ్వాస నస్థుడయ్ని గణపతి దేవమహారాజులుంగారి దినాలలో వీరి వద్ద వుండే మహాప్రధానులయ్ని గోపరాజు రామంన్నగారు శాలివాహన శకం ౧౦౬R (1145 AD) శకమంద్ధు ప్రభువు దగ్గిర దానంపట్టి సమ స్త మయ్నినియ్యోగులకు గ్రామకరిణీకపు మీరాశీలు నిన్న కొయించ్చే యెడల యీ గ్రామాలకు శ్రీ వత్స గోత్రు య్ని ఆశ్వలాయన సూత్రులయ్ని దంమ్మవళం యల్లమరాజు అనే నందవరీకి యేకభోగంగ్గా రస్మితేజో పాజ౯నలతో కూడా మిరాశి యేపర్చి యిచ్చినారు గన్కు తదారథ్యంల యేతద్వంశజు లబ్న వారు మిరాశీ అనుభవిస్తూ వుంన్నారు. శాలివాహన శకం ౧౫౦౦(1578 AD) వరకు వడ్డెరెడ్డి కనా౯క ప్రభుత్వం జర్గిన మీదట మొగలాయి ప్రభుత్వం వచ్చే గన్కు మల్కీ విభురాం పాదు షాహా వారు వచ్చి దేశం ఆక్రమించ్చుకొని పరగణా దేశపాండ్యాల అమీళ్ల పరంగా ఆమాని మామ్లి య్యతు జర్గించ్చుకుంటూ వచ్చినారు. తదనంతరం వాశిరెడ్డి చంద్రమౌళిగారు వినుకొండ్డ పరగణాలో పాతికె వఁట్టు మలరాజు పెదరామారాయనింగ్గారి దగ్గిర క్రయానకు పుచ్చుకొన్నారు గన్కు అప్పట్లో యీ మూడు గ్రామాలు వాశిరెడ్డి వారి వంట్టులో దాఖలు అయి వాశిరెడ్డి చంద్రమౌళిగారు, పెదరామ లింగ్గన్నగారు, పెదనర్సంన్నగారు, సూరంన్నగారు, చి నర్సంన్నగారు, చి రామలింగంన్నగారు, జ. గ్గన్నగారు, రామన్న గారు ప్రభుత్వం చేశి మీదట రాజా వాశిరెడ్డి వెంక్కటాద్రి నాయుడు బహద్దురు మన్నె సులతానుగారు ప్రభుత్వం చేత్ని మీదట యీయన కొమారుడయిన జగన్నాధబాబుగారు ప్రభుత్వం చేశినారు. (ఇక్కడ మాతృకలో కొంత భాగం కానరాదు)