పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

182 వొలాపల్లి కైఫీయతు రాజా కై ఫీయతు మౌజే బొల్లాపల్లి పరగణే వినుకొండ్డ మాప్పాతికె వంట్టు యిలా నులరాజు వెంక్కట గుండ్డారావు ఫసలీ (1817 AD) యీశ్వగ నామ సంవత్సర ఫాల్గుణ శు౫ లు మజ్కూరి కరణాలు కుండు రామన్న యరికలయ్య వ్రాయించినది. పూర్వం నుంచ్చి యీ గ్రామానికి బొల్లాపల్లి అనే వాడుక చేత వుండగా గజపతి సింహ్వాస నస్థుడయిన గణపతి దేవ మహారాజులుఁగ్గారి దినాలలో వీరి వద్ద వుండే మహాప్రధానులయిన గోప రాజు రామంన్నగారు శాలివాహన శకం లం౬ (1144 AD) శకమందు సమస్తమయిన నియ్యో గులకు గ్రామకరిణీకపు మిరాశీ నిన్నజయించ్చే యెడల ం గ్రామానికి వశిష్ఠ సగోత్రులయిన ఆశ్వ లాయన సూత్రులయిన నారపరాజు అనే నందవరీకి యేకభోగఁగ్గా మిరాశీ యిచ్చినారు. గనుక తదారభ్య తద్వంశజులయినవారు మిరాశీ అనుభవిస్తూ వుంన్నారు. తదనంతరం శాలివాహనం ౧౫౦౦ శకం (1578 AD) వరకు వడ్డెరెడ్డి కనాకొటక ప్రభుత్వములు జర్గిన మీదట మొగలాయి ప్రభుత్వం వహించ్చేను గనుక యీ శీమ మల్కి విభురాం పాదుషా వారు ఆక్రమించ్చుకొని సముతు బద్ధీ పరగణాలు నిన్నకొయించ్చే యెడల యీ గ్రామం వినుకొండ పరగణాలో దాఖలు చేసి పరగణా దేశపాండ్యాల పరంగ్గా అమానీ మామియ్యతు జరిగించుకొంట్టు వచ్చినారు. తదనంతరం మలరాజు పెదరామారాయనిఁగ్గారు ప్రబలుడయి పూర్వం వినుకొఁడ్డ పరగణాకు వుంన్న రామరాజుగారిని సాధించ్చి యీ పరగణాకు జమీ సంప్పాదించ్చుకొని ప్రభుత్వం చేసిన మీదట మలరాజు కొండ్డం రాయనింగ్గారు నీలాద్రిరాయనింగ్గారు సూరన్నగారు చిన రామారాయనింగ్గారు. వెంక్కట నరసింహ్వ రాయనింగ్గారు ప్రభుత్వం చేసిన మీదట వెంక్కట గుండ్డారాయనింగ్గారు ప్రభుత్వం చేసినారు. సదర హీ మలరాజు వారికి జమీ వచ్చిన ( గాయితు గుత్తి వెంక్కట నాయకుడు అనే వాడి పట్టుబడి కింద గ్రామణ ౧౦౦ నూరు వరహాలకు ౪ం నలభై యింటికి జవానులు (?) కొలిచేటట్టుగా నిన్నజొయించ్చి యిచ్చినారు గనుక తదారథ్యం సదరహీ నాయకుడి వంశస్థులు అనుభవిస్తూ వుంన్నారు. రామన్న యెరికెలయ్య వ్రాలు.