పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కయిఫియ్యతు కొండపు బాచంన్న, చింన్నంన్న, క్రిష్టప్పగారి నలుగురిలోను తనతాత. బాచంన్న హంశ పాతికెను సహిరణ్యోదక కన్యాదాన పూర్వకంగ్గా ధారపోశి తింమ్మగార్కి తన పేరిటి డానపత్రికె యిచ్చి ఆ పడుచుకు జనియించ్చిన కొమాళ్లు తన వంశ భాస్కరులని నియతి పరచి ఆ నియతికి తిరుమలయ గారిని వెంకటయగారిని వడఁబరచి అనంతర కాలాననే ఆస్వాస్థ్యానకు దక్షత ముత్తరాజు యందే వుంచ్చి యీలాగుగా తన సంస్థానం ఆయన ఆధీనంగా చెశివుండగా అంత్తట కొంన్ని దినములకు దైవయోగం చేతను దేశంలో కుట్రములు బలికి భాస్కరునివారునితో పగగొని పోరురూపుఁడ్డంగా ఆకాలోచితోన్క వారిబలిమి యెక్కువ గన్కు యేనుగవారు. పట్టి కుంట్టివారు కురుచెటివారు, రామ రాజులు వారు, మొదలయినవారు బహుపగతులు: గన్కు దేశం విడిచి తిరుమలయగారు వకస్తలాన్కు భాస్కరయగారు వకస్తలాన్కు పోయిరి. మగ్గళకుంటలో వాడవారి దగ్గర పిన్నవారికి ముత్తరాజును వుంచ్చి భాస్కరయగారు గోలుకొండపోయి ఎదుశాహ వారి దశజనం అయి సకల బహుమానాలు పొంద్ది పగవారిని అణచే యత్నాలకు స్నదులు పుట్టించ్చుకోగానే ఆ పగవారె వేగుపుడ్డి రామలింగ భాస్కరుని గారి శ్రేయస్సు సంహించక శాజర కృత్యం చేశిరి గన్కు, భాస్కరయగారు అక్కడనే అంతరించ్చేను ఆ ప్రాణోత్కాంతి కాలమందు తన పగ ఆణచగల వాడు ముత్తరాజు వుంన్నాడని స్మరించ్చి శరీరం విడిచెను. ఆ స్థితి విని పరితపించ్చి ముత్తరాజు ఆనంతకాలమందు రామలింగ్గ భాస్కరున్కి పూర్వ దైహిక క్రియలు నిర్వత్తించ్చి ఆయన పోష్యమయిన పరిజనమును రక్షణచేరుకుఁట్టూ వుండి అంతట కొంతకాలానకు దేశములో కుట్రలు బలుసుట రాజు తెలుసుకొని తదురు ఆదుర్గములు సాధించుటకు తడవులేదు గన్కు చాలిన తరపుదారుణ్నీ అంపదంచి యఖిలాసుభానుడు బహుషత్ర హితుడయినందున ఆ కాలానకు తగినవాడని మహమ్మదుఖుల్లో పాడుశహాగారు అతణ్ని కొండపల్లిలో వుంచినవారై తరపు అతనికి ఇచ్చెను. అతను పాలిస్తూ వుండగా ముత్తరాజు మంగళకుంట నుండి వచ్చి యఖిలాసుఖానుని (యిక్లాస్ ఖాన్) తోను ప్రవేశం కల్పించుకొని యుండి అంతకంతకు భాగ్యోదయం చాతకు దాక్షిణుకుడై కార్యదక్షతతో నుండి భాస్కరుని భాస్కరయగారు అవసానమందుంన్న పుత్తరం చిత్తమందు వుంచి వారి పగతులైన మన్నె వారిని వొకరొకరిని వొకనెపం చాతచంపించి యీలాగుగా కొంతపగ పలుచనగా చేసి దేశముఖుడు భాస్కరుని తిరుమలయ్యగారు విద్వరంచావ వున్నారని ప్రభువుకు తెలుపుడు చేసి, కౌలు యిప్పించి, పిలిపించి, వారికి బహుమానం చేసేందుకు మగడిసీమకు వచ్చి వుండిరి. అనంతర మందు ముత్తరాజుని కాండసీమ మాత్రం ప్రభువు చాతను గుత్తకు పుచ్చుకొని కడమ తరఫులకు పెత్తనం చేస్తూ వుండగా గోలకొండ మహారాజుగారు తలబు చేస్తే ఖానుడుపోయెను ఆయన వెంబడిని ముత్తరాజు పోయెను. అక్కడ యఖికాసుఖానుడువారు గతించినందున ఆయన కొడుకు శభానుఖానుకు తరపు కట్టించు కొనివచ్చి యిక్కడ ముత్తరాజు అతను నిరోధించి, తిరిగి ముత్తరాజు గోలకొండ వెళ్ళి వెనకటి కసుభానిమిత్తం ప్రత్యేకం కచేరీపెళ్లుతూ ఎనాటి రాత్రి కచేరీలో మరచి నిద్రించగా అర్ధరాత్రి ఢిల్లీ నుంచ్చి వుత్తరములు వచ్చి నందున ఆ సమయములో ప్రభుత్వం చేస్తూ వుంన్న షాహే మహమూదు పాడుశాహాగారు నిషా గా వుండి ముతసద్దిని పిలువమని కోరుపద్దాలజుకు పరుమాయించ్చి నంతల్లో వారు వచ్చి చూడగా ముత్తరాజు