పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

173 కయిఫియ్యతు మానం పొంది పరగణె మజుకూరు గ్రామాదులలోవున్న భూమికి నాలుగోపాలు భూస్వాస్యముంన్నూ వో ౧ వరహాకు పావు చొప్పున సువరాజాదాయముంన్ను వేల్పూరు, గంన్నవరం, భారతాపురం, తిమ్మాపురం, లక్కవరం మొదలయ్ని అయిదు గ్రామాదులు సర్వాగ్రహారములుంన్ను వ్రాయించ్చు కుని అనుభవిస్తూ వుండగా సదరహి ప్రౌడ దేవరాయులువారి పింమ్మట గజపతివారు శా ౧ 83 శకం (1514 AD) వర్కు అధికారంచేశిన మీదట నరపతి శింహ్వాసనస్థుడైన కృష్ణరాయలు గజపతివారిని పలాయనంచేశి యీదేశం ఆక్రమించ్చి యావినికొండ్డ శీమకు నాదేండ్ల అప్పయ్యగార్కి అధికారం యిచ్చినారు గన్కు ఆస్పట్లో రాయని మంత్రి భాస్కరుగార్కి శా౧౪౩లా శకం (1516 AD) ధాతునామ సంవ్వత్సర మందు భర్తపూడి అనే గ్రామం అగ్రహారం యిచ్చినారు గన్కు అనుభవిస్తూ ప్రజల నిమిత్తం దేహు చాలించ్చెను. శాలివాహనం ౧౪౫౫ (1533A D) సంవ్వత్సరమువర్కు కృష్ణరాయలు అధికారం జరిగిన మీదట అచ్యుతరాయుణ ప్రభుత్వం చేశేటప్పుడు పయిన వ్రాశిన రాయని మంత్రి భాస్కరునిగార్కి జ్ఞాతి అయి రామయామాత్య భాస్కరుడు ప్రతాపవంత్తుడై అచ్యుతదేవరాయులవారి అనుగ్రహం సంప్పాదన చేస్కుని ఆంధ్రదేశాన్కు ప్రభుత్వంచే వినికొండ్డ శీమ సలకరిణీకము పుద్ధరించ్చి జ్ఞాతుల రక్షించి కొండవీటి గోపీనాథపట్ల నిర్మాణం చేయించ్చి అచ్యుతరాయులవారి ప్రభుత్వం శా. ౧౪౬౩ శకం (1541 AD) వర్కు ప్రభుత్వంచేశాను. తదనంతరం సదాశివరాయులు రామరాయులు తిరుమల రాయులు శ్రీరంగరాయులు శా. ౧౪౬౪ శకం (1542AD) లగాయతు శా. ౫౦౦ శకం (1579 AD) వర్కు ప్రభుత్వం చేశే యెడల పయిన వ్రాశిన రామయామాత్య భాస్కరునిగారికి జ్ఞాతి అయిన కొండప్ప భాస్కరుడు మహాప్రబలుడై క్షత్రియ కంన్నియను రాయబంధువులు యింటను వివాహమై విస్పష్టాలయిన జ్ఞాతులు మీరాశీ నిమిత్తం కలత చేస్తే రాయులవారి అనుమతిని విరూపాక్షస్వామి వారి ఆలయమందు జయరేఖలు కట్టుకుని ప్రమాణ పూర్వకముగా గెలిచి రాయులవారి చాతను పూర్వ మిరాశీ స్వాస్త్య నిర్వాహకాలకు సనదులు వ్రాయించ్చుకుని కొండా దండనాధాగ్రణి అనేష్వంట్టి (అనేటటువంటి) బిరుదు పద్యములు కలవాడై ప్రభుత్వం చేశాను. ౧౫౦౨ (16R0 AD) అగునేటి విక్రమ నామ సంవత్సరములో హజరతు విభురాహీముపాదుశాహా గారు కన్నా కొట్క పాదుశాహా అయి శ్రీ రఁగ్గరాయ దేవ మహారాయల వారిని జయించి యీవేశం ఆక్రమించుకొని సవరు పాదుశాహాగారున్ను వీరి కొమారులయిన మహం మ్మదు కొల్లిపాదుళాహాగారున్నూ ప్రభుత్వం చేశినారు గన్కు మహుమ్మదు కొల్లిపాదుళాహా వారి ప్రభుత్వ కాలమందు కొండప్ప భాస్కరుని వంశీకుడయిన రామలింగ భాస్కరుడు బహుగొప్ప గాప్రవర్తిస్తూ వుండ్డి గుంటుపల్లి వీర మరాజు కొమారుడయిన ముత్తరాజును. బాల్యకాలాన చూచ్ని యాదు వుండ్డి అతని యందు రేఖావిశేషాలు చాలావుండుట చేతను శ్రేయోవంత్తుడని విచారించ్చి వినికొండ్డకు కాట్రగుంట్టవారి వెంబడి పోయినప్పుడు తనతోబుట్టు అయిన గంగకు చింతగుంట్ట పెంటమ రాజ్కు కొమాతె౯ ఆయిన తింమ్మగారిని యీ ముత్తరాజ్కు యిచ్చి వివాహంచేశి అవివాహ కాలాన తిరుమలయగారి చేతను అంన్న గారి నెంక్కటయ చేతను అనుమతి వడశి తన తాతలు