పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

17/ గండి గనుములు కైఫీయతు కైఫీయతు మౌజే గండిగనుమల పరగణె వినుకొండ్డ ముప్పాతికే వఁట్టు ఇలాభే మలరాజు వెంక్కట గుండ్డారావు స్న (1817 AD) ఫసలీ మజ్కూరి కరణాలు నారాయణప్ప కృష్ణమ్మ వ్రాయించినది. L పూర్వం యీ స్తళానికి పడమర కాకిర్యాల కనుమ పుత్తరం కంబాల కనుమ యీ రెండు కనుమల గండ్డి స్తలముద్దు గ్రామ నిర్మాణం చేశినఁద్ను గండ్డి గనుమల అనే నామం వాడికె ఆయ్నిది, తదనంతరం గజపతి శింహ్వసనస్టుడయ్ని గణపతి దేవమహారాజులుంగారి ప్రభుత్వ ములో వీరివద్ద వుండే మహా ప్రధానులయ్ని గోపరాజు రామంన్నగారు శాలివాహన శకం ౧౦౬: (1145 AD) రక్తాక్షి నామ సంవత్సరమందు ప్రభువు దగ్గిర దానంపట్టి సమస్తమయ్ని నియ్యో గులకు గ్రామకరిణీకవు మిరాశీలు నిన్నజొయించ్చే యెడల యీ గ్రామానికి భారద్వాజస గోత్రు లయ్ని అపస్తంభ సూత్రులయ్ని కేసిరాజు రంగరాజు అనే అతనికి మిరాశీ యిచ్చి వుండగా ఆయ మిరాశీ అనుభవిస్తూవుండి ఆయ్నకు మొగసంత్తు లేనందువల్ల కౌండిన్యస గోత్రులయ్ని చిరుకూరి నర్స రాజు అనే ఆరువేల నియ్యోగికి కుమాత్తెశాను యిచ్చి పెండ్లి చేసి దహోత్ర భాగం బాతమిరాశీ యిచ్చినాడు గన్కు తదారభ్యం చిరుకూరివారి సంతతివారు వడ్డెరెడ్డి కన్నాటకములో యీ గ్రామం శ్రోత్రియంగ్గా ఆగ్రహారంగ్గా యేప్పర్చి భాగివారు అనే బ్రాంహ్మలకు యిచ్చి వుండ్డంగా వారు కొఁన్నాళ్లు అనుభవిస్తూ వుండి భిలమయినమీదట మొగలాయిలో యీ పరగణా అమానీగా దాఖలు చేస్కుని పరగణా దేశపాండ్యాల పరంగ్గా అమానీ మామియ్యతు జర్గించ్చుకొఁట్టూ వచ్చి తద నంతరం రామరాజు వారికి యిచ్చివుండగా మరికొంన్నాళ్లు అనుభవిస్తూ వుండంగా మలరాజు పెద రామారాయలింగ్గారు హైదరాబాదు సుబావారి నుంచ్చి యీ పరగణాకు జమీ సంపాదించుకొని రామరాయనింగ్గారు, కొండలరాయనింగ్గారు, పెదనర్సన్నంగారు, నీలాద్రిరాయనింగ్గారు, చ్నిరామారాయ నింగ్గారు, పెద్ద వెంక్కట నరసింహ్వరాయనింగ్గారు, పెదగుండ్డారాయనింగ్గారు ప్రభుత్వం చేశ్నిమీదట వెంకట గుండ్డారాయనింగ్గారు స్న౨౨ (1817 AD) ఫసలీవరకు ప్రభుత్వంచేస్తూవున్నారు. C వూరికి పడమర భిలమయిన రామలింగస్వామి వారి దేవాలయం. యిది పూర్వం మజ్కూరి మిరాశీదారుడయిన మల్లవరాజు సంజీవరాయుడు అనే వారు ప్రతిష్ఠ చేశినారు. యిప్పుడు పూజా నైవేద్యాలు జరుగడం లేదు. గ్రామానికి ఉత్తరం ఘట్టు మీద చక్రాలదు మల్లేశ్వరస్వామి వారి దద్దశం వున్నది. స్వయం వ్యక్తమయిన స్థళం. పూజా నైవేద్యం జరగడము లేదు. గ్రామములో ఆంజనేయ విగ్రహము వున్నది. పేరంట్టాల పోలేరమ్మ దద్దశం వున్నది. గ్రామానికి పడమరయిన రాతికొండ అనేది వున్నది. పూర్వం యీ ఘట్టు తొవ్వి గవులు చే యిన్ము చేశినందుకు దాఖలా పూర్వ గవులు విస్తరించ్చి యీ ఘట్టున వున్నవి. యిక్కడ విస్తరించిన వేపచెట్లు వున్నవి. RAD కరణాలు చిల్కూరు కృష్ణమ్మ వ్రాలు నారాయణప్ప వ్రాలు.