పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కయిఫియ్యతు విభురాం పాదుషాహావారు ఫౌజు జమాయించ్చుకొని కన్నాటక పాదుషాహా అయిన శ్రీరంగ్గరాయు లును జయించ్చి దేశం స్వాధీనం చేస్కుని వినుకొండ, బెల్లంకొండ, కొండవీడు దుగ్గాజులలో తమ తరపు రాణా బందీలు వుంచి పరగణా దేశపాంద్యాల ఆమీళ్ల పరంగా అమానీమామ్లియ్యతు జరిగించు కొంటూవుండే అప్పట్లో యీ వినుకొండ్డ పరగణాకు రామరాజు వారు అనేవారు పుండ్డివుండ్డగా మలరాజు పెదరామారాయనింగ్గారి దినాలలో సుబావారి నుంచ్చి యీ పరగణాకు జమీ తెచ్చుకొని అనుభవిస్తూ వుండి కొన్నాళ్లకు సర్కారుపైకం విస్తరించి బాకీ వుండి యీ వినుకొండ పరగణాలో పాతిక వంత్తు వాశిరెడ్డి చంద్రమౌళిగారికి ఖరీడు క్రింద యిచ్చినారు గన్కు తదారథ్య వాశిరెడ్డి చంద్రమౌళి గారు, పెదరామలింగన్నగారు, పెదనర్సంన్నగారు, సూరంన్నగారు, చి నర్సంన్నగారు, బుచ్చయ్యగారు రామంన్నగారు ప్రభుత్వం చేశిన మీదట రాజా వాశిరెడ్డి వెంక్కటాద్రి నాయుడు బహద్దరు మన్నే సులతాను గారు స్న ౨౨౫ ఫసలీ (1815 AD) వర్కు ప్రభుత్వం చేశినారు. యీయన కుమారుడయిన వాశిరెడ్డి జగన్నాధబాబు గారు ప్రభుత్వం చేస్తూ వుంన్నారు. యీ గ్రామం వాశిరెడ్డి వారి వంత్తు కింద వచ్చిన లాగాయతు యీ గ్రామం వాశిరెడ్డివారి సంబంధులయిన శాఖమూరి వారు అనేకంమ్మ వారికి మొఖాసా యిచ్చినారు గనుక వారు యీ గ్రామములో కోట కట్టుకొని బహు దినాలుగా పారంపర్యంగా అనుభవిస్తూ వుంన్నారు. 170 యీ గ్రామంలో ఉండే దేవాలయాలు :- గ్రామ మధ్యమందు శ్రీ చెన్న మల్లేశ్వరస్వామి వారి దేవాలయం సదరహీ మొఖాసా దారు లయిన శాఖమూరి వారే ప్రతిష్ఠ చేశినది. యిప్పుడు అరకుచ్చల అరవీసం మాన్యం నిత్యం నైవేద్య దీపారాధనలకు జరుగుతూ వుంన్నది. C G దీనికి సమీప మంద్దు చెన్న కేశవస్వామి వారి దేవాలయం సదరహీ శాఖమూరి వారే ప్రతిష్ఠ చేసినది. యిప్పుడు అరకుచ్చల ఆరవీసం నీరు పొలం నిత్య నైవేద్య దీపారాధనలకు జరుగుతూ వుంన్నది. గ్రామ మధ్యమంద్దు ఆంజనేయులు గుడి, విఘ్నేశ్వరుడి గుడి వుంన్నది. యిదిన్ని శాఖమూరి వారే ప్రతిష్ఠ చేశినది. నిత్యనైవేద్య దీపారాధనలకు జరుగుతూ వుంన్నది. రాశి కాల్చేటప్పుడు సదరహీ దేముండ్లకు దేముడు కి మూడు దోశెళ్ళు యిస్తూ వుంటారు. గ్రామానకు పడమర చెరువు కట్టమీద ఖిలమయిన శివాలయం. యిది పూర్వం యిక్కడ మఠం జఁగాలు కాపురం వుండేటప్పుడు లింగమూత్తి ప్రతిష్ఠ చేశినందున దాఖలాలు చెర్వు కొమ్ము మీద శిలా శాసన స్తంభం వున్నది. కరణాలు బొగ్గరపు వెంక్కమ రాజు వ్రాలు యీ మోటుపల్లి వ్రాలు.