పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

169 కొచ్చల= కయిఫియ్యతు కైఫియ్యతు మౌజే కొచ్చలతో పరగణె వినికొండ వంట్టు యిలాఖే రాజా వాశిరెడ్డి జగన్నాధబాయి న్న ౧౨౨౭ (1817 AD) ఫసలి యీశ్వర నామ సంవత్సర ఫాల్గుణ శు బుధవారం మజ్కూరి కరణం బొగ్గరపు వెంక్కమరాజు వ్రాయించిది.— పూర్వం నుంచ్చి యీ గ్రామానికి కొచ్చల్లజా అనే వాడుక వుండ్డగా గజపతి వంశస్థు డయ్ని విశ్వంభర దేవు ప్రబలుడై పన్నెండ్డు సంవత్సరములు ప్రభుత్వం చేసిన మీదట కొమారు డయ్ని గణపతి దేవ మహారాజులుంగ్గారు దేశం ఆక్రమించ్చుకొని ప్రభుత్వం చేసిన మీదట కోట భీమరాజు శింహ్వాసనా రూఢులై రాజ్యం చేస్తూ వుఁడ్డగా కుళోత్తుగ్గ గొంక్క చోళరాజు కొమారు డయ్ని రాజేంద్ర చోళమహారాజులుంగ్గారు యీ దేశానికి వచ్చి భీమరాజు తోటి యుద్ధం చేశా జయించ్చి దేశం ఆక్రమించుకొని శాలివాహన శకం ౧౦౯ శకం (1177 AD) వరకు ప్రభుత్వం చేశిన మీదట కాకతీయ్య వంశస్థుడయ్ని గణపతి దేవ మహారాజులుఁగారు పృధ్వీ సామ్రాజ్యంచేయు చుండగా శాలివాహన శకం ౦౧౭౦ (1248 AD) అగు నేటి సౌమ్య సంవ్వత్సరమందు వినుకొండ సీమ నెల్గుతూ వుండే యీ కొచ్చల్ల అగ్రహారంగ్గా యేప్పర్చి త్రిపురాంత కేశ్వర మఠానికి సమప్పి౯ంచ్చి యిచ్చినారు. గన్కు తధారభ్యం యీ గ్రామం అగ్రహారంగా త్రిపురాంత కేశ్వర స్వామి వారి మఠానికి శాలివాహన శకం ౧౩౩౨ (1420 AD) శకం వరకు రెడ్ల ప్రభుత్వం ఆఖరువరకు జరుగుతూ వచ్చినది. తదనంతరం ఆనె గొందె. శింహ్వాసస్థుడయ్ని హరి హర దేవ మహా రాయలు ప్రభుత్వములో పూర్వము నుంచీ నడుస్తూ వున్న యీ గ్రామం సదరహీ త్రిపురాంత్త కేశ్వరస్వామి వారి మతస్థుడయ్ని నీలకంఠ దేవర అనే అతను పూర్వం నుంచ్చి మఠానకు నడుస్తూ వుండే యీ గ్రామం కరణీకపు మిరాశీ గభజ గ్రామా.... శకం ౧౩౬౬ (1444 AD) అగు నేటి రక్తాక్షినామ సంవత్సర వైశాఖ శు ౧౫ లు భారద్వాజస గోత్రులయ్ని ఆపస్తంభసూత్రులయ్ని బొగ్గరపు కస్తూరయ్య అనే ఆరువేల నియ్యోగికి విక్రయించు కొన్నారు గన్కు తదారభ్య బొగ్గరపు కస్తూరయ్య వంశస్థులయినవారు సదరహీ గ్రామానికి మిరాశీ దాల్గుజౌ అయి అష్ఠభోగ సహితంగ్గా అనుభవిస్తూన్నందుకు దాఖలా యేమంటే వీరివద్ద పూర్వం ఆమరస్థులు వ్రాశియిచ్చిన క్రయదత్తి సనదులు హజరువున్నది. తదనంతరం లాంగూల గజపతి, పురుషోత్తమ గజపతి, ప్రతాపరుద్ర గజపతి మొదలయిన గజపతులు ప్రభుత్వం చేసిన మీదట వీరభద్రగజపతి ప్రభుత్వం చేస్తూవుఁడ్డగా శ్రీ మన్మహామండలేశ్వరులయ్ని కృష్ణదేవ మహారాయులు శింహ్వసనారూఢుబయి పృధ్వీసామ్రాజ్యం శ్రేయుచుండి దిగ్విజయాద్దము బయలుదేరి యీ దేశానికి వచ్చి వీరభద్రగజపతితోటి యుద్ధం చేశి జయించ్చి పట్టుకొని దేశం ఆక్రమించుకొని ప్రభుత్వం చేశినమీదట అచ్యుతరాయులు, సదాశివరాయులు, రామరాయుల తిరుమలరాయులు ప్రభుత్వం జర్గిన మీదట శ్రీరంగ్గరాయులు ప్రభుత్వం చేస్తూవుండగా మొగలాయి ప్రభుత్వం వచ్చె గన్కు మల్కీ 21)