పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

161 అంగలూరు కై ఫీయతు కైఫీయతు మౌజే ఆంగ్గలూరు పరగణి వినుకొండ్డ ముప్పాతికె వంట్టు యిలాఖే మలరాజు వెంక్కట గొండ్డారాయునింగారు స్న౦౨౨౭ ఫసలి (1817 AD) ఫసలీ యీశ్వరనామ సంవ్వతర ఫాల్గుణ శు ౫ లు మజ్కూరి కరణాలు బొగ్గరపు సుబ్బరాజు పాపయ్య వ్రాయించ్చినది. పూర్వం నుంచి యీ గ్రామానికి ఆంగ్గలూరు అనే వాడుక. తదనంతరం గజపతి వంశ స్తుడయిన గణపతి దేవ మహారాజులుంగ్గారి ప్రభుత్వం జరిగిన మీదట కాకతియ్య వంశస్తుడయిన ప్రతాప గణపతి దేవ మహారాజులుంగారి దినాలలో యీ గ్రామం అగ్రహారంగా యేప్పర్చి త్రిపు రాంతక దేవర మఠానికియిచ్చి వుండగా కన్నాటకములో సదరహీ గ్రామం మకస్థులయిన నీలకంఠ దేవరు బొగ్గరపు కస్తూరయ్య అనే ఆరువేల నియ్యోగికి కుచ్చలతో కూడ యీ గ్రామం క్రయ దత్తిగా ౩౦౦ వరహలకు మిరాశీ యిచ్చినారు. గనుక తదారథ్య తద్వంశజులయిన వడ్డెరెడ్డి కన్నాకాటక ప్రభుత్వం పరియంతరం అనుభవిస్తూ వుంన్నారు. తదనం గరం మలరాజు వారి జమీలో వచ్చినమీదట మలరాజు వెంక్కటాచలరాయుంగారు అధికారం చేస్తుంది మెట్టలక్ష్మి నారాయణప్ప అనే బ్రాంహ్మడికి ౪ం వరహాల శ్రోత్రియం నిన్న కాయించ్చి యిచ్చినారు గనుక తదారభ్య వారు కొంన్నాళ్ళు ఆనుభవించిన మీదట పెదగుండ్డా రాయనింగారి దినాలలో ఆనంద సంవత్సర మందు పునహా యీ గ్రామం సత్యనంద స్వాముల వారికి యిరవై అయిదు వరహాలు శ్రోత్రియంగా నిన్న యించ్చి యిచ్చి వుండగా కొన్నాళ్ళ మీదట యిందులో ఫలం తక్కువ అయినందున వారు అంతట వదులుకొన్న మీదట మలరాజు వెంక్కట గుండారాయనింగారు ప్రభుత్వానికి వచ్చినది మొదలుకొని అమాని చేసుకొని ప్రభుత్వం చేస్తూ వుంన్నారు. కరణం బొగ్గరపు సుబ్బారాజు వాలు 20) యీ పాజరాజు వ్రాలు.