పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

180 బుద్దాం కయిఫియ్యతు పడక శిష్యులను పిలిచి మీరు పండితారాధ్యుల వారివద్దకు వెళ్ళి ఆక్రమముగా జీవహింస చేశిన వారికి విధి తెలుసుకొని తదనంతరం తెలియ చేసి రమ్మనె గన్కు ఆ ప్రకారం వారు వెళ్ళి తెలుసుకొన్నంతల్లో యీ ప్రకారం చేయించ్చిన వారికి కండ్లు తోడించడం విధి అని యేపరచె గన్కు యీ సంగతి యావత్తు మీ వలనే జరిగినది అని విశదపరచి నంతలో ఆయ్న బహు కోపయుక్తుడయి బౌద్ధులు చేసిన కృత్రిమం అని తెలిశి ప్రభావం ప్రకటించవలయునని స్వయం కృతముగా తమ నేత్రములు తీసిరి గన్కు లింగోద్భవస్వామి వారి అనుగ్రహం వల్లను కన్నులు తిరిగి రావడానకు సమాధాన తదనంతరం యీ ముప్పంద్దుం పరియంతము ప్రకారంగా కంన్నులు తోడి అక్కడికి దక్షిణం రెండు కోసుల దూర గల గోకనెశ్వరం వెళ్లి శ్రీ గోకనె౯శ్వరస్వామి వారి దశ౯నము చేశ్నింత్తట్లో నిలువు కంన్నులుగా ప్రసాదించ్చినారు గన్కు పండితారాధ్యుల వారు శ్రీ స్వామి వారి సన్ని ధానమంద్ను వుండి యీ చందవోలులో శైవులకు శివపూజాహత లేక పోదునిన్నీ యిక్కడ బౌద్ధులు ఖిలమైపోదుర నింన్నీ శాపం యిచ్చి శ్రీశైల ప్రదక్షిణార్థముగా వెళ్లినారు. అంతట యీ బుద్ధాంలో నివాసంగా యుండే జయినులు తశ్శాప విశేషం వల్ల దినే దినే ఖిలమై ఆ పట్ణం విచ్ఛిత్తం అయిపోయె గన్కు యిప్పుడు ఆ పట్నం గొప్ప దిబ్బగా యేపడి వుంన్నది. అందుల్లో యిప్పుడు యవరు అయినా తవ్వితే గొప్ప యిటికె రాళ్ళు వగయిరాలు బయలు దేరుతవి. అందులో జయినులు యొక్క శిలా ప్రతిమలు మొదలయినవి వుంన్నవి అని చెప్పుతారు యిదివరకు అక్కడ కాపురముండ్డి విజయం పొందినవారు వేరు. అంతా పాడుగా వుంన్నది. యిది పూర్వము బౌద్ధులు కాపురం చేశ్ని పట్నం గన్కు బౌద్ధం అని నామం యిప్పటికింన్ని ప్రశిద్దిగా వున్నది. (20) మెయి ఆ.న.. మల్లయ్య వ్రాలు. ప్రజోత్పత్తి నామ సంవత్సర వైశాఖ బ ౧౩ సోమవారం ది ౨౦ ౧౮GO (1811 AD) సంవ్వత్సరం -