పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

159 30. బుద్దాం కయిఫియతు బుద్ధాం తాలుకే రేపల్లె సర్కారు మృత్యు జాంన్న గరు యీ గ్రామంలో పూర్వం జయినులు కాపురం చేర్ని స్తలం లవాజయినుల కందరికి కుల గురువు అయినటు వంటింన్ని తన్మ తానుసరణ శాస్త్ర ప్రవీణుడయినటు వంటింన్ని మహా ప్రభావ సంపన్నుడయ్ని బిజ్జయుండనే అతను C పట్టణమఁద్దే మటం కట్టించ్చుకొని నివాసంగా యుండి గ్రామంలో వచ్చె ఫలశాయి అనుభవిస్తూ వుండి చందవోలులో వుండే లింగోద్భవస్వామి కింన్ని వుత్సవములు వగయిరాలు జరుగగలందులకు కొండ పడమటి బుద్దరాజులుంగారి చేతను కొన్ని వృత్తులు ధారా గ్రహితం చేయించ్చి తాను బౌద్ధుడు అయినందున యీ స్వామి వాలకు లింగోద్భవ మహాదేవర పాండేశ్వర మహాదేవర అనే నామాంకితములు వహియింప చేశి వుండి వుంన్నంతల్లో తూర్పు దేశస్థుడు అయ్నిఘవంట్టి వానసుడు (?) యీ దేశములు చూడవలయునని వచ్చినంతల్లో యా దేశ బ్రాంహ్మణులు సహా పంక్తి యోగ్యత యివ్వక పోయిరి గను అభిమానియై శ్రీ శైల గనుక తమకు వంశ పావను పర్వతమునకు వెళ్ళి శ్రీ మల్లిఖార్జునస్వామి వారిదశజనం చేసుకొని త సంత్తరం ఆ పరబ్రహ్మ రూపుణ్ణి గూర్చి తపస్సు చేసినంతల్లో కొన్ని దినములకు ఆయన భక్తి తాత్పర్యములకు అనుగ్ర హించ్చి ప్రత్యేకమయిన కోరిక యిస్తున్నానని శెలవు యిచ్చిరి. గనుక డయినటు వంటింన్ని శివభక్తాగ గణ్యుడయినటు వంటింన్ని సకల వేద శాస్త్ర ప్రవీణుడయినటు వంటింన్ని కొమారుడు కావలెనని కోరినందున ఆ ప్రకారం ప్రసాదించి అంతర్హితుడయినాడు. ఆటు పిమ్మట మరి కొన్ని దినములకు దివ్యతేజో పుంజుడు అయినటువంటి కుమారుడు వుద్భవించ్చినంద్ను ఆనంద మయుడయి శ్రీ మల్లిఖాజున స్వామి వారి వరపుత్రుడుగు నట్టి మల్లిఖార్జున పండితారాధ్యులు అనే నామాంకితం యేపరచినారు అంతట దినదిన ప్రవర్థమానుడై సకల విద్యాపరిపూర్ణుడయి ఆఖండిత వీర శైవాగమాంత ప్రవీణుడయి ఆనుపమానుడయి ప్రసిద్ధిపొంది తమ మతోద్ధారకుడయిన శ్రీ బసవేశ్వరుడనే మహాత్ముల దశకానముచేసి తదనుజ్ఞ వడశి శ్రీశైల ప్రదక్షిణ నిమిత్తార్థమై వెళ్లవలెనని ప్రయాణమయి అనేక శిష్యజన సంఘముతో వస్తూ చందవోలు వచ్చి శ్రీ పాండేశ్వర స్వామి యొక్క ముఖ మంటపములో ప్రవేశించ్చి యున్నంతలో సదరహి బుద్ధాంలో నివాసంగా యుండే బిజ్జయుడు యీ మల్లిఖార్జున పండితారాధులవారి విభవాతి శయములు చూచి బలాబలములు కనుక్కొనే నిమిత్తము ప్రసంగములు జరిగించినంద్ను ఆబిజ్జయుని యొక్క ప్రశ్నలు పూర్వ పక్షముగా చేసి భౌద్ధమత ప్రభావములు ఖండన చేసి నంతల్లో పండితారాధ్యులవారి శివపూజా ద్రవ్యములలో నిత్యా నియమముగా వుండే నక్షత్ర హారతి తన శిష్యుడి చేత చెప్పించి బుద్దాం పంపిస్తూ వుండేవరకూ పండితారాధ్యుల వారి శిష్యుడు గురువు చేత మాట వచ్చునని విమర్శించి ఆ నక్షత్ర హారతి తీసుకు పొయ్యేవాణ్ణి కనుక్కొని వధచేశి తిరిగి వచ్చినంతలో బౌద్ధ గురువు తన