పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10

గ్రామ కైఫియత్తులు


యడల యీ గ్రామం పొంన్నూరు సముతులో చేర్నిది. మాణిక్యారావు వారు మంన్నేవారు గానుంన్నూ మానూరు వారు మజ్ముంధాల్లు౯న్నూ పాతృని వారు దేశపాండ్యాలుగా నుంన్నూ యేప౯రచి నారు గన్కు సముతు ఆమీలు దేశస్థుల పరంగ్కా ఆమాని మామ్లియ్యతు చాలా దినములు జర్గినవి. అప్పట్లో దేవ స్తలముల్కు అర్చనాదులు జర్గిక వుండ్డేను.

స్న ౧౧౨౨ ఫసలీ (AD 1712)లో కొండ్డవీటి శీమ మూడు వంట్లు చేశి జమీదాల్ల౯కు పంచ్చి పెట్టెయడల యీ గ్రామం రమణయ్యా మాణిక్యరాయినింగ్గారి వంట్టులో వారు కొంన్ని దినములు ప్రభుత్వము చెశ్ని తర్వాతను వారి తంమ్ములయిన మల్లంన్న గారుంన్ను శీతన్న గారు మొదలయిన వారు 33 సంవత్సరములు స్న ౧౧౬౦ పసలీ (AD 1750) వర్కు ప్రభుత్వం చేశే కాలమందు వారి దగ్గర దివాను అయ్ని కోటంరాజు రామన్న భీమేశ్వర స్వామి వారి ఆలయం జిన్నో౯ధారం చేయించి స్వామి వార్కి సంప్రోక్షణ చేశి యీ దేమున్కి పూర్వం వుండ్డుకుంన్న మాన్యం కుచ్చల్లు ౦౺౦ అరకుచ్చల్లు పొలమును జర్గించ్చినారు.

తదనంత్తరం గోపాల మాణిక్యరాయుని గారు స్న ౧౧౬౮ ఫసలీ (AD 1758) వర్కు ప్రభుత్వం చెశ్ని తర్వాతను జంగ్దన్నా మాణిక్యరాయినిం గారు స్న ౧౧౬౮ ఫసలీ (AD 1758)లో ప్రభుత్వాన్కు వచ్చి మామ్లియతు చేస్తూ యిచ్చ్ని యినాములు.

కు ౦ ౺ ౦ చావలి శేషం భట్ల గార్కి
కు ౦ ౺ ౦ చింత్తలపాటి రామభట్ల గార్కి
కు ౦ ౹ ౦ శుక యోగుల వెంక్కట శాస్తుల౯ గార్కి
————————
కు ౧ ౹ ౦

యినాం యిప్పించ్చి స్న ౧౧౮౨ ఫసలీ (AD 1772) వర్కు ౧౪ సంవత్సరములు ప్రభుత్వము చెశ్ని తర్వాతను తమ్ములయిన తిరుపతి రాయినింగారు స్న ౧౧౮౩ ఫసలీ (AD 1773)లో తాలూకా సఖం పంచ్చుకొంన్నారు గన్కు యీ గ్రామం తిరుపతి రాయినింగారి వంట్టులో వచ్చి రాచూరి తాలూకాలో దాఖలయినంద్ను ఆయ్న ప్రభుత్వము చేస్తూ యిచ్చిన యినాములు

కు ౦ ౺ ౦ కీడాంచి బుచ్చయ్య అయ్యవాల్ల౯ గార్కి
కు ౦ ౺ ౦ మంత్రవాది లక్ష్మీ నృశింహ శాస్తుల౯ గార్కి
కు ౦ ౺ ౦ వింజమూరి రామానుజాచార్యులు
కు ౦ ఽ = యద్ధనపూడి యర్ర రామభట్ల గార్కి
కు ౦ ౺ ౦ మండవ రామచంద్రాచార్యులు గార్కి