పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆరిమండ్డ

11


యీ యినాములు యిప్పించి స్న ౧౨౦౧ ఫసలీ (AD 1791) వర్కు ప్రభుత్వము చేశిన తర్వాతను వీరి కుమారులయ్ని అప్పారాయునింగ్గారు స్న ౧౨౦౮ (AD 1798) ఫసలీ వర్కు సంత్తు లేకుండా చనిపోయిరి గన్కు పయ్ని ప్రశ్ని జంగన్నా మాణిక్య రాయునింగారి కొమారులయ్ని భావన్నా మాణిక్యరాయునింగ్గారు స్న ౧౨౦౯ ఫసలీ (AD 1799) లగాయతు స్న ౧౨౧౧ ఫసలీ (AD 1801) వర్కు మూడు సంవత్సరములు ప్రభుత్వము చెశ్ని తర్వాతను స్న ౧౨౧౨ ఫసలీ (AD 1802)లో మహారాజు శ్రీ కుంఫిణి వారు రాచూరి తాలూకా యాలం వేశిరి గన్కు రాజా మల్రాజు వెంక్కాట గుండ్డా రాయినిం గారు కొనుక్కొని ప్రభుత్వము చేస్తూ వుండగా మజ్కూరు కరిణికులు అయ్యి అరిమండ్డ పేర్రాజు కామరాజు యీ గ్రామంలో మొగలాయి నాటి నుంచ్చి అచ౯నాదులకు ల్కే వుండ్డి వుంన్న శ్రీ సంగ్గ మేశ్వర స్వామి శ్రీ గోపాలస్వామి వాల్ల౯కు ఆలయములు జీన్నో౯ద్ధారము చేయించ్చి సంప్రోక్షణలు చేయించ్చిరి గన్కు యీ స్వామి వాల్ల౯కు.

కు ౦ ౺ ౦ శ్రీ సంగ్దమేశ్వర స్వామి వారికి
కు ౦ ౺ ౦ శ్రీ వేణు గోపాల స్వామి వారికి
—————————
కు ౧

వెరశి కుచ్చెల భూమి యినాం యిప్పించ్చి సదరహి ఫసలీ లగాయతు స్న ౧౨౨౧ ఫసలీ (AD 1814) పర్కు ప్రభుత్వం చేస్తూ వుంన్నారు

రిమాకు౯

తోటలు :

౧ శుక యోగులవారి తోట ౧కి
౨ చిల్ల బత్తుని వారి తోటలు
౧ కాటం రాజు వారి తోట
౧ భూపతి వారి తోట
౧ బఁదా వారి తోట
——————

చర్వులు :

౧ బూనగ చర్వు
౧ వఝుల వారి చర్పు
౧ చావలి వారి చర్వు
———————

కయిఫియ్యతు ముత్తు౯జా