పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

9

ఆరిమండ్డ

కయిఫియ్యతు మౌజే ఆరిమండ్డ సంతు పొంన్నూరు సర్కారు ముత్తు౯ జాంన్నగరు.

యీ గ్రామాన్కు పూర్వం నుంచ్చి ఆరిమండ అనే పేరు వున్నంది.యీ గ్రామాన్కు దక్షిణ పాశ్వ౯ మంద్దు తుంగ్గభద్ర, కొండ్డేరు. కూడలి సంగ్గమ ప్రదేశ్ మంద్దు బహు అనాది సిద్ధమయ్ని శివాలయం వుంన్నది. అదేమున్కి సంగ్గమేశ్వరుడు అని నామాక్కితం చేశి పూర్వము ఋషులు ప్రతిష్ఠ చేసినారు అన్నవాడికె వుంన్నది.

శాలివాహన శకమంద్దు గజపతి శింహ్వాసనస్థుడైన గణపతి మహారాజులుంగ్గారు యీ దేశములు ప్రభుత్వం చేశేటప్పుడు వీరి దగ్గర మహా ప్రధానులయి గోపరాజు రామంన్న గారు బ్రాంహ్మణులకు గ్రామ మిరాశీలు నిన్న౯యించ్చే యడల యీ ఆరిమండ్లకు రుక్ శాఖాధ్యాయనులుంన్నూ జామదగ్ని గోత్రోద్భవులుంన్నూ అయ్ని అరిమండ్డ వెంకట్రాజు అనే అతన్కి శాలివాహనం ౧౦౬౬ శక (AD 1144) మగునేటి రక్తాక్షి సంవత్సర భాద్రపద బహుళ ౩౦ అంగార్క వారం సూర్యగ్రహణ కాలమంద్దు కరిణికపు మిరాశి ధారాగ్రహితం చేశినారు, తద్వంశజులు అనుభవిస్తూ వుంన్నారు.

రెడ్లు ప్రభుత్వము చేసే కాలమంద్దు మజ్కూరి మిరాశీదారుడైన అరిమండ్ల తిమ్మ రాజు గ్రామ మధ్యమంద్దు విష్ణు స్తలం కట్టించ్చి శాలివాహనం ౧౨౬౪ శక (AD 1342) మంద్దు వేణుగోపాలస్వామి వారి ప్రతిష్ఠ చేశి పూర్వీకమయిన సంగ్గమేశ్వర స్వామి వారి ఆలయం జీన్నో౯ద్ధారం చేయించ్చినారు గన్కు ఖామంద్దులు చేశ్ని స్వాస్త్యములు కు ౫ శ్రీ సంగ్దమేశ్వర స్వామి వారికి ఖండ్డికే వణకి ౦౺౦ శ్రీ వేణుగోపాల స్వామి వారికి ౫౧౦ వెరళి, యీ ప్రకారంగ్గా నిన్న౯యించ్చి సకలోత్సవములు జర్గే లాగ్ను కట్టడి చేశినారు.

గజపతి వారు తిర్గి ప్రభుత్వాన్కు వచ్చి రాజ్యం చేశేటప్పుడు పురుషోత్తమ గజపతి వారి అధికారంలో శాలివాహనం ౧౪౧౯ శక (AD 1497) మంద్దు మజ్కూరి మిరాశీదారు డయ్ని ఆరిమండ్డ అప్పలరాజు గ్రామ మధ్యమంద్దు వుంన్న వేణుగోపాల స్వామి వారి ఆలయాన్కి వుత్తర పాశ్వ౯ మంద్దు శివాలయం కట్టించ్చి భీమేశ్వరుడనే లింగ్డ మూత్తి౯ని ప్రతిష్ఠ చేశినారు గన్కు యీ దేమున్కి నిత్యనైవేద్య దీపారాధనలు జర్గగలంద్లుకు కు ౦౺౦ అర కుచ్చల పొలం యినాం యిప్పించ్చినారు.

వడ్డె కన్నా౯ట్క ప్రభుత్వములు శాలివాహనం ౧౫౦౦ శకం (AD 1578) వరకు జర్గిన తర్వాతను దేశములు మ్లేచ్ఛాక్రాంత్త మయినంద్ను హకీములు దేశముఖ దేశపాండ్యాలు మొదలయ్ని బారాముత సద్ధీ హోదాలు యేప౯రచి కొండవీటి శీమ సముతు బంద్దీలు చేశే