పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కయిఫియ్యతు వంటి విమానముతో నా వృక్ష సన్నిధి భాగము ప్రకాశించుచుండెను. ನ್ ఆ విమానము కడ బంగారు మయమైన సింహాసనము గలదు. ఆ సింహాసనము నధిష్ఠించి భక్తుల ననుగ్రహించుటకు భావనారాయ ణుడను పేరుతో జగధక్షకుడై భగవంతుడుండెను. 149 స్వస్తిశ్రీ శకషణంబులు ౫౦౫ 563 AD ఆగు నేటి ప్రమాధీచ నామ సంవత్సర మీన సంక్రమాణ యుక్త ఫాల్గుణ శు ౧౫ లు ఆదివారం శ్రీ మదఖిలాండ కోటి బ్రహ్మండనాయక జగజ్జయ విభవ సచ్చిదానంద స్వరూప అమితాద్భుత అప్రమేయ అవ్యయ సాక్షాదివ్యవిగ్రహ, క్షీర, భూరుహ సంభూత త్రిగుణాత్మక స్వరూపా చోళ ప్రసన్న సుందర విమాన దక్షిణాభి ముఖా సాగరోత్తర కుండినీ పుర విషయే శ్రీ బాపట్ల ఆముదాలపల్లి పురనివాసులయ్ని శ్రీ మత్సుందరవల్లీ రాజ్యలక్ష్మీ సమేతులయ్ని శ్రీ భావనారాయణస్వామి వారిని ప్రతిష్ఠ చేశి యీ స్వామి వారి చుట్టూ ప్రతిష్ఠ చేశి దేవతలు. ఈశాన్యం రంగనాథః తదనుపుర హరాఉత్తరం నారశిుహః ఆగ్నేయం భాష్య కారోనిరురుతి దిశయో ఆంజనేయో గరుత్మా, ప్రత్యంచ్యాం కేశవార్యః అన్ని దిశి రమాచోత్తరం శేష భోగీ, మధ్యేశ్రీ భూమి యుక్తం సకల భయహరం భావదేవం నమామి శ్లో॥ ఈశాన్యం రంగనాథః తదనుపురహరా ఉత్తరం నారసింహః ఆగ్నేయం భాష్యకారో నిరురుతి దిశయో ఆంజనేయో గరుత్మాన్ ప్రత్యంచ్యాం కేశవార్యః అనిల దిశిరమాచోత్తరం శేషభోగీ! మధ్యే శ్రీ భూమి యుక్తం సకల భయహరం భావదేవం నమామి. ] [తా॥ ఈ శాన్యభాగమున రంగనాథుడును, ఉత్తరమున నీశ్వరాదిగణములు నారిసింహు డాగ్నేయమునను, నిరురుతి దశయందు భాష్యకారులును, పడమర వైపు ఆంజనేయస్వామి-గరుత్మం తుడును, వాయువ్యమున లక్ష్మీ దేవియు - మరలనుత్తరమున ఆదిశేషుడును మధ్యన శ్రీ భూదేవీ సమేతుడగు భావనారాయణుడు నుండిరి. వారందరిని నమస్కరించుచున్నాను.] యీ ప్రకారంగాను శ్రీ స్వామివారి ప్రతిష్ట చేశి శ్రీ మన్మహా మండలేశ్వరుని నిత్య వ్రత వీర ప్రతాపచోళ భల్లయచోళ మహారాజ రాజరాజభూపాల చక్రవతి గారు ప్రతిష్టాకాలమండు సకలోత్సవములు జర్గగ లండుకు పంచకోశ పరివృతుగాను, కాపట్ల ఆముదాలపల్లి యీ రెండు గ్రామాదులు యేకగ్రామం చేసి సహిరణ్యోదక దానధూపూర్వకంగాను అగ్రహరం సమపించి నారు ఇందుకు భూప్రమాణ నినయాలు ఘడలు 6 శ్లోకాలు -