పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

137 కయిఫియ్యతు వకటి ఆరువేల నియ్యోగులు సంప్రతులు గౌతమ సగోత్రీకులయ్ని అన్నాప్రగడ నామసంప్రతి ౨ కి ౧, కౌండ్డిన్యసగోత్రికులయి్ను చుండూరి వారి సంప్రతి , వెరశి మూడు సంప్రతులు నినయించ్చి ప్రభుత్వం చేశి తర్వాతను సదరహి గణపతి మహారాజులుంగారి తరుణమఁద్దు ఆయన కుమారుడు కాకతి గణపతి ప్రభుత్వం చేశెటప్పుడు చోళదేశపు రాజులు యిద్దరు రాచకామాళ్ళు భీమదేవు కేశ వదేవు అనే వారు సకుటుంబ్బ సమేతముగా మితపరిజనం తోటి భద్రాచల యాత్రశాయదలచి పొంన్నూరు మొదలయ్ని దివ్యదేశములు శేవిస్తూ యీ స్తలాన్కు వచ్చి ఆ రాత్రి యిక్కడ నివశించి యీ స్తలం మందువుంన్న కోదండ్డ రామస్వామి వారి కొద్ది ఆలయంలో వుండివుంన్నారు గన్కు స్వామి వారి దశ౯ నాన్కు వచ్చి దశ నంచేశి స్తల పూర్వోత్తరం అగ్గినంతల్లో పూర్వప్రభావములు శృతపరచే వర్కు విన్నవారై యీ స్తల గొప్ప చాయవలె నన్న తాత్పర్యం కల్గి తమరు సహ కుటుంబ్బ సపరివార సమేతులై అరణ్యములు ఆక్రమించ్చి శ్రీ భద్రాచలరామస్వామి వారి దశనం చేస్కుని సుబులమై వస్తిమా యిక్కడ నిల్చి పూర్వప్రకారంగా ఆలయ ప్రాకార మంటప ములు మొదలయ్నివి నిర్మాణం చేయించి దివ్య తిరుమల చేస్తామని ప్రాధన చేస్కుని స్వామి వారి నమస్కరించి తిరిగి దిడుదుల్కు వచ్చి ఆ రాత్రి సుఖ నిద్రచేశి మరునాడు ఆరుణో దయతత్పూర్వమే లేచి సదరహి అన్నదమ్ములయ్ని రాచ కొమాళ్లు యిద్దరుఁన్ను ప్రయాణమై తమ వారి తోటి గ్రామం అతిక్రమించ్చి వెళ్లుతూ వుఁడై వర్కు శ్రీ రామస్వామి వారు లక్ష్మణ స్వామి సమేతంగా మనుష్యరూపం ధరియించ్చి యిరువై అయిదు సంవత్సరములు వయస్సు కల్గి నటువంటి రాచకొమారులై వుత్తమాశ్వముల నిక్కి శర చాపధరులై బయలుదేరి భీమదేవు. కేశవదేవు గాలకను కలియపొయ్యేవర్కు వారు చూచి మీరు యవరు యక్కడికి వెళ్లుతారని అద్దితే మేము చుండూరిలో వుండే రాచకొమాళ్లము మేము భద్రాచలం వెళ్లుతామని అనిరి గన్కు వీరి దేహకాంత్తులు మృదు వాక్యములు విని మేముకూడా వస్తాము సోబతుగా వెళ్లుతామన్నారు యీ ప్రకారంగా వెళ్లుతూ నిత్యముంన్ను వీర్ని వకచోట శామణీ చేయించ్చి తదనంతరం తమరు వేరేటిఖాణాకు వెళ్లేటట్టుగా వెళ్లుతూ భద్రాచలం ప్రవేశించి చేసి వారు యాత్ర చేస్కుని తిర్గి వచ్చేటప్పుడు పైని వ్రాశి ప్రకారమే వీర్కి సహాయులై నిత్య ప్రయాణముల యందు సంరక్షణ చేస్తూ భీమదేవు కేశవదేవు గాలను చుండూరి గ్రామంలో ప్రవేశించ్చి చేసి మానవవేషదారులైన శ్రీరామలక్ష్మణస్వామి వాల అదృశ్యమైరి గన్కు తదనంతరం పైని వ్రాశ్ని రాజులు వీరు కానక యీ స్తలమందు నిల్చి యీ గ్రామంలో పుఁడై పెద్దలైన వార్ని పిల్వ నంప్పించ్చి యీ గ్రామంలో రాజులు వుంన్నారా అని అడిగితే లేదని చెప్పిరి గన్కు యీ స్వామివారి మహత్యమని తెల్సుకుని అక్కడ నివాసం చేశి తమ దేశం నుంచ్చి పదాధణం తెప్పించి శ్రీ కోదండ్డ రామస్వామి వారి గథ౯ గుడి అంతరాళిక ముఖమంటపములు మొదలయినవి కట్టించ్చి ముఖమంటప ములో శ్రీ రామద్రామాయణం రామరావణ యుద్ధం శ్లోకాధముతో విగ్రహ మోడీలక్కరంగు నకషా చేయించ్చినారు పంన్నిద్దారాశ్వారాదులను వుంచ్చి శ్రీ రఁగ్గరాజభట్టరు వార్ని స్తానాచార్యులుగా నిన్న యించ్చి తీధప్రసాదములు జర్గించ్చి దివ్య తిరుపతి చేశి శ్రీ స్వామి వాలను పూజించడాన్కు శ్రీకృష్ణమాచార్యులనే విష్ణునసుణ్ని నిన్నకొయించ్చి శ్రీ విశ్వేశ్వర స్వామి వార్కి ఆలయం కట్టించ్చి 17)