పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

188 కయిఫియ్యతు స్త లములు పరిపాలనచేస్తూ యీ చందవోలుకు వచ్చి శ్రీ లింగోద్భవ స్వామి శ్రీ పాండేశ్వర స్వామి వారి దశజనం చేసి యీ స్తల ప్రభావం యావత్తూ చిత్తగించ్చి యిక్కడ కొన్ని దినములు నివాసం చేయడానకు వుద్దేశించ్చి దేవాలయాల్కు దక్షిణ భాగమందునను కోట బెట్టించవలెనని శాలివాహనం ౧౨౮౦ శక (1358 AD) మంద్ధు ఆరంభం చేయించ్చి కోట బెట్టించ్చి అందులో రాజమహళ్ళు కట్టించ్చి యీ మధ్య దేశం పాలనచేస్తూ స్వామి వారలకు నిత్యోత్సవము, పక్షోత్సవ, మాసోత్సవ ములు మొదలయ్ని మహోత్సవములు జగ్గిస్తూ అనేక ఆభరణములు సమపించ్చి కంచ్చు మద్దెళ్ళు, కంచ్చుదివిటీలు, ఆభరణములు సమపణ చేశి మహోత్సములు జర్గించ్చినారు. తదనంతరం శాలివాహన ౧౩౦౦ (1378 AD) శకం మొదల్కుని శా. ౧౪౫౬ శకం (1584 AD) వరకు వడ్డెరెడ్డి కన్నాటక ప్రభుత్వములు జరిగిన మీదట మొగలాయి ప్రభుత్వము వచ్చిన తర్వాతను మల్కిభరాహిం సుల్తానబ్దుల్లా తానీషా ఆలంగీరు వారి ప్రభుత్వాలు జరిగిన మీదట నవాబు ముబారజు ఖా ను సుభేడక్కన్ గారు యి నిజాం పట్నం సర్కారుకు మొహతశి అయి శేఖు హబిబుల్లాకు కు ౬ ఆరు కుచ్చళ్ళు పొలము ఆ తర్వాత వారి తాల్కు ఆమీళ్ళు బ:దరు నిజాం పట్నం సర్కారులకు ప్రభుత్వం చేశినారు. వీరి తర్వాత సయ్యిదు కుతుబీ ఆలంగారు సుబాకు ప్రభుత్వానకు వచ్చినారు గన్కు CV చందవోలు నిజాంపట్నం సర్కారుకు చేరినది గనుక బందరు నిజాంపట్నం సర్కాలకు వారి ఆమీళ్ళ పరంగా మామియ్యతు జరిగినది. తదనంతరం నిజాముల్ ముల్కు వారు సుబాకు అధ్యక్షు లయినారు గనుక వారి తరపున వ్యవహరస్తులు అబ్ధుల్లా ఖాను ఆలీఖాలీ ఖాను రుస్తుంజంగ్గు మృషల్ ఖాలిబా(ఖాను) సరఫరాజిఖా(ను) కలందరఖా (ను) యీ ఆర్గురు బందురు నిజాంపట్నం సర్కాలకు అధ్యక్షులయి వీరి పరంగ్గా మామ్లియతు జర్గినది. నిజాముల్ ముల్కు బహద్దు సుబాగారి పెద్ద కుమారుడైన నాసరు జంగు బహదుగారు సుబా ప్రభుత్వానికి వచ్చి యీ సర్కాలుకొ ఫరాంసు వారికి యిచ్చిరి గన్కు స్న ౧౬౦ (175) A-D) ఫసలీ లో ఫరాంసువారు యీ తాలూకాలు ఆక్రమించుకుని బందరు డివిజను పెద్దల శేరు మువ్వే చిన్నల శేరు అనే.... దొరలు గారందరికి వచ్చిరి గన్కు వీరి అధికారం జర్గిన తదనంతరం ముళ్శే మురళేను అనే ధోరను యిక్కడ పుంచ్చిరి గన్కు బందరులో గోరందరి చేస్తూ వుండే దినములలో సదరహీ మజుకూరులో వున్న దేముడు గుళ్ళు ఆంత్తరువు పడి పూజా నమస్కారము జర్గుకుండా వున్నందు యీ దేవ స్తలాల్కు స్తానాచాలు అయ్ని పినపాటి వీరంన్న అయ్యవాలు గారు గ్రామంలోకి వచ్చి యిలాగంటి మహ స్తలములు అంతరువు పడి వుండడం యుక్తముగా వుండదని ఆలయములు బాగు చేయించ్చి లింగోద్భ స్వామి వార్కి పునః ప్రతిష్ఠ చేయించ్చి నిత్యం పుత్సవములు జరిగిస్తూ యింక్కా అధికమయి వుత్సవములు జర్గించవలెనని విచారించి ద్రవ్య సానుకూలము తగలక పులిచేరు పెద్దకు బాశి ఆయివుంన్న ఆనంద రంగ పిళ్ళగారి దగ్గరకు వెళ్ళి అక్కడ వుంన్న వారి వల్ల ద్రవ్య సానుకూలము చేసుకుంటే సదరహి వీరంన్న అయ్యవారు పులిచేరులో వుండగా ఫరాంసు వారి గురువయ్ని సత్యానందస్వామి వారనే ఫాదరి తన మతస్తులయ్ని శిష్యులను కొందరిని తీస్కుని