పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కయిఫియ్యతు శివలింగ్గాచన కాలమ-ద్ధు న నిత్యవ్రతంగా సమప్పికొంచ్చే నక్షత్ర హరతి బెజ్జుడనే బౌద్ధుడు యామరించ్చి చోరత్వం చేతను తీసుకొని పోతూ వుండగా పండితారాధ్యుల వారి శిష్యుల్కు తెలిసి చందవోలుకు పశ్చిమ మాగణంగ్గా వెళ్ళుతూ వుంన్న బెజ్జుంణ్ని కనుక్కుని అత్యంత్త కోపం చేసి గురు ద్రవ్యం హరించ్చినందున వాణ్ని వధచేసి ఆ నక్షత్ర హరతి తీస్కుని వచ్చి గురువుకు తెలియకుండా శివపూజా ద్రవ్యములో వుంచ్చినాడు. అటు పిమ్మట బౌద్ధులు కొందరు పండ్డితారాధ్యుల దగ్గరకు వెళ్ళి ఆక్రమంగా జీవహింస చేశ్ని వారికి శాస్త్రోక్త ప్రకారంగా చేయ తగ్గ ప్రాయశ్చితముకు విధియేమో మా గురువు మింమ్మున అడిగి రంమ్మంన్నాడని చెప్పెనంతల్లో గఁట్టి పని చేయించిన వారికి కన్నులు తోడించడం విధి యని చెప్పే గనుక బౌద్ధులు యీ ఆక్రమం మీవల్లనే జర్గినది అని తెలియచేసిరి గనుక పండ్డితారాధ్యులవారు దివ్య జ్ఞానం వల్ల విచారించ్చి యింద్కు ప్రతీహతం విచారిస్తిమా అసత్యం పల్కినవారు మవుతాము యిది బౌద్ధవులు చేశ్ని కృత్యముగదా అనీ తెలిశి ‘స్నానసంధ్యాధ్యనుష్టానముతోను సరణశాస్త్రోక్త శివపూజా క్రియలు జర్పుకుని లింగోద్భవ స్వామి వారి యదుట కూచుండి సంధ్యాశివుని యందే భక్తి వుంచ్చి యీశ్వరుడికి తన నేత్రములు ఆపించ్చే కొరకు స్వయంకృతముగానే తమ యొక్క నేత్రములు తీశి లింగోద్భవుని ముందర పెట్టిన తర్వాత ఆతని భక్తి విశేషంవల్ల ఆ భక్తునికి తిర్గికంన్నులు ప్రసాదిస్తూ వచ్చి నంతల్లో తన ప్రభావం ప్రకటన చేసే కొరకు తిరిగి కంన్నులు తోడుతూ వచ్చినారు. యీ ప్రకారంగా ముప్పై ఐదు పరియంత్తరం కంన్నులు తోడి అంతట పండితారాధ్యులవారు బౌద్ధులు యీ ప్రకారంగా విష పరీక్ష చేశ్నింద్ను కోపం వచ్చి యంతట నుంచ్చి యీ చందవోలులో లింగధారులైనవారు శివపూజ చయ్యడాన్కు అహజాత లేక పోననింన్ని యీ బౌద్ధుల్కు యీ స్తలంలో జయం లేకపోదురనింన్ని శాపం యిచ్చి అక్కడి నుంచి లేచి ఆ గ్రామానకు దక్షిణ భాగమందు వుంన్నఘ వంటి మహ ప్రభావం గల గోకన్నేశ్వరం వెళ్ళి శివసాన్నిధ్యమందు వున్న సమయమున గోకన్నేశ్వర స్వామి వారు పండితారాధ్యుల వారి యందు కరుణించ్చి నిలువు కంన్నులుగా దయ చేసినారు అక్కడి నుంచ్చి శ్రీశైల ప్రదక్షిణ నిమిత్యాధకాము వెళ్ళినారు. యీ హెతువునుంచి వచ్చిన శాపంవల్లను బౌద్ధులు దినేదినే అపజయులై ఖిలమయిపోయిరి. 182 తదనంతరం శ్రీ కుమార కాకతియ్య ప్రతాపరుద్ర దేవ మహారాజులుంగారు పృధివి పాలనం చేస్తూ ధనదు ప్రోలి పండిశ్వర మహదేవరకు శాలివాహనం ౧౨౧౫ (1293 AD) శక మందునను ఖ ౧ పుట్టెడు క్షేత్రము సమప్పిగాంచ్చి శ్రీ పాండేశ్వర మహదేవరకు దీపాలకుంన్ను పంచ పర్యాల అధిక పడి ప్రయాలకుంన్ను శ్రీ దనధువోలు అంగడిని అంమ్మిన భఁడానికి నెలకు మాడకు రెండు వీసాలు లెఖను ఆయముగానను ఆ చంద్రాకముగా సమపించ్చి శిలా శాసనం సంస్థాపించ్చినారు. ఆటు పిమ్మట రెడ్లు ప్రభుత్వ సమయంలో ఆన వేమారెడ్డిగారు అధికారంగా వుండే సమయ మందు తంమ్ముడయ్ని వీరభద్ర వేమారెడ్డిగారి రాజమహెంద్రంలో నివాసంగా వుండి పుంణ్య