పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

130 కఫియ్యతు అక్కడనుంచ్చి నిడుబ్రోలు అనే గ్రామం వచ్చి అక్కడ శివాలయం ప్రతిష్ఠ చే తదనంతరం చందవోలు వచ్చినారు యీ స్తలములో చతుర్యోగములా వుచింప్పపడ్డ లింగోద్భవస్వామి వారి యొక్క ఆలయములు శిధిలీకృతములై అచక్రానా ది కృతములు జరుగకవుండి వుంన్నందున యిది గొప్పగా జర్గవలశ్ని స్తలం అని తోచి కైలాస ప్రసారముగా ఆలయములు నిర్మాణం చేయించ వలెనని విచారించ్చి సద్విధాన ప్రకరణములు తెలియగలందుల్కు ఆగమజ్ఞులవల్లను శిల్పికారుల వల్లను విచారించ్చే వర్కు మనస్సు సమాధానంగ్గా చెప్పలేకపోయినారు. గన్కు తను సంక్కల్పం ఆవునని బహువిచార గ్రస్తతగా వుడ్డి వున్నంతల్లో ఆరాత్రి లింగోద్భవ స్వామివారు ఆరాజు మానసం చొప్పున సంక్కల్ప శిద్ధిచేయ వలశ్నివాడై స్వప్న రూపముగా దృశ్యమయి యీ కై లాస ప్రస్థావ నిన్నకొయమునకు లింగానుచితదానకు నాయందు స్కల (సకల) ధానా గరిష్ఠుడయి తన యొక్క హృత్పద్మమె కైలాస ప్రస్థావ నిన్నయముగా భావించ్చి తన్మద నివతినగు వంన్ను సంవ్విధాన ఆగమోక్త ప్రకారంగా మానసే కంచేత పూజిస్తూ వుంన్న పూసులనయనారు అనే భక్తాగ్రంణ్యుడు యీ పట్నముద్దే నివాసంచేసి పూసలు అమ్ముకుంటు వుంన్నాడు. అతని దగ్గరకు వెళ్లితె కైలాసప్రస్థార విధానం యావత్తూ చెప్పగలడు అని తన భక్తుని మహిమ విస్తరింప చెయ్యుమనేని ఎతద్విదృగ్గా వాక్యములు ప్రసాదించ్చి అంతధాజానుడయినంద్ను రాజు మేలుకొచ్చి ఆత్యాశ్చర్యమనుస్కుడై వుదయమందు లేచి ఆనయనారు వున్న స్తలం విమశిజంచుకుని స్వప్న వృత్తాంతమాత్యంతముంన్ను వివరించ్చి సంతలో సంతోషించ్చి మరునాడు వుదయాన తన శివపూజ వేళకురమ్మని చెప్పినఁద్ను తత్ప్రకారంగా మరునాడు రాజు వచ్చినంతలో ఆ భక్తుడు తన నిత్య నియమం యావత్తు జర్పుకుని తదనంతరం రాజును యదటికి పిలిచి తదేక నిష్టాగరిష్ఠరచేత తను యొక్క పుదరం ప్రక్కలు కావించ్చేవర్కు ఆ వుదర మధ్యమఁద్దు కైలాస ప్రస్థార విధానం యావత్తు కనిపించ్చె గనుక రాజు ఆత్యాశ్చర్యపరుడై ఆ భక్తుని మహిమలు వన్నికొస్తూ తత్ప్రకారం పఠమందు లిఖించ్చిన తదనంతరం ఆ భక్తుడు పూర్వపు విధానంగా మెచ్చె గన్కు రాజు చాలా స్తోత్రం చేశి తాను లిఖించిన పటం శిల్పికారుడ్కి ఆగ పడ్చి ఆ చొప్పున స్తల నిర్మాణముల చేయించ్చడాన్కు ఆరంభించి శాలివాహనం ౧౦౪౨ శకమంద్దు (1120 AD) మధ్య గభగుడి లింగోద్భవ మూత్తిని ప్రతిష్ఠ చేశి చుట్టూ ఆవరణములు గాకట్టించ్చి లోపలినె పదహారు లింగ్గాలను ప్రతిష్ఠచేశి లింగ్గాల్కు అన్నింటికి అభిషేకం చేశ్ని పుదకం వక్క పానువట్టం సోమసూత్రం నుంచ్చి ప్రవ హించ్చె లాగ్ను నిమాణం చేయించ్చినారు. స్తలమందు గభజగుడి అంతరానక ముఖమంటప యీ ప్రముఖ ముట్టప గాలిగోపుర ప్రాకారములు కట్టించ్చి చుట్టూ వుపజగతి మహజగతి మొదలయ్నివి కనక సుందర మీమాంస శాస్త్రోక్త ప్రకారంగ్గా కట్టించిరి గనుక యీ ప్రకారముగా తయారు చేయించ్చె వర్కు వక సంవత్సం అయింది గన్కు రాజుకు బ్రంహ్మంతను గురించ్చి నిత్యం వక లింగ్డమును ప్రతిష్ఠ చేయవలశ్ని నియమం గన్కు మున్నూట అరవయి దినములు కొద్ది ఆలయములుగా కట్టించ్చె మజుకూరిలోనే మున్నూట లరవయి లింగ్గాలను ప్రతిష్ఠ చేయించ్చినారు. యీ ప్రకారముగా కట్టించ్చే ఆలయముల్కు రాజు చేరే నిమిత్తం పది అయిదు వేల బండ్లు వుచ్చి రాళ్లు తెప్పిస్తూ వుండగా బండ్లు పట్నం ధరికి వచ్చి అక్కడ నుంచ్చి కదలక పాయ గనుక యే విధం వల్లను బండ్లు .