పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కయిఫియ్యతు రాజులు ప్రభుత్వం శా ౧౨౪౨ (18:0 AD) శకం వర్కు జర్గిన తర్వాతను రెడ్లు ప్రభుత్వానకు వచ్చి వీరుంన్ను తర్వాత గజపతి గారుంన్ను అధికారము చేశిన తర్వాతను విజయనగరం నరపతి శింహ్వాసనస్థుడయిన కృష్ణరాయులు శా ౧౪౩౭ (1515 AD) శకం లగాయతు దేశం ఆక్రమించుకొని ప్రభుత్వము చేశిన తర్వాతను అచ్యుత రాయులు, సదాశివ రాయులు, రామరాయులు, తిరుమల రాయులు గారి అధికారములు జరిగిన పిమ్మట శ్రీరఁగ్గరాయులు వారి ప్రభుత్వములో మజకూరిలో గ్రామానకు దక్షిణ భాగమంద్దు ప్రబలంగా విష్ణు స్తలం కట్టించ వలననే ప్రయత్నము చేయించ్చి గర్భ గుడి తయారు చేయించ్చి మఖమంటపములు మొదలయినవి విస్తారంగా కట్టించడానకు స్తంభాలు దూలాలు మాత్రము అమపికొంచ్చి కప్పు బండలు వేయించడానకు తజవీజు జరిగిస్తూ వుండగా యింతలో విభు రాహీము పాదుశాహా వారు సదరహికనాజట్క పాదుశాహా అయిన శ్రీ రంగరాయులును జయించ్చి శా ౧౫౦౨ (1680 AD) శకం యీ దేశం ఆక్రమించ్చిరి గన్కు అంతట దేవాలయం పని నిలిచి పోయినది. గర్భగుడి మాత్రము తయారు అయినందున గ్రామస్తులు శ్రీ చన్న కేశవ స్వామి వారిని ప్రతిష్ఠ చేసినారు. ఆ సమయంలోనే మల్కీ విభురాహీము పాదుళాహీ వారి తరపున అమానను ములా యీ దేశాన్కు ప్రభుత్వానకు వచ్చి బాహారీ దేవాలయములు పాడు చేసే యడలను పయిన వ్రాసిన భీమేశ్వర స్వామివారి ఆలయములు పడగొట్టించ్చి స్తలం ఖిలపరచినారు. తదనంతరం గ్రామస్తులు పయిన వ్రాసిన చంన్న కేశవస్వామి వారి ఆలయానకు నైరుతి భాగం శివస్థలం కట్టించ్చి శ్రీ సోమే శ్వర స్వామివారనే లింగమూతికాని ప్రతిష్ఠ చేశినారు గన్కు పుభయ దేవస్థానములకు మొగలాయి వారు నిసయించ్చిన క్షేత్రం యినాములు. 124 నారు. కు ౨ శ్రీ చంన్న కేశవస్వామి వార్కి శ్రీ సోమేశ్వర స్వామి వార్కి " " ๆ ๆ ౪ అయిన దేవభాగం కు 040 భజంత్రీలకు కుOUC కళావంత్తి నీలకు కు *

  • కుచ్చళ్లు యినాము యిప్పించ్చి నిత్య నైవేద్య దీపారాధనలు జరిగించ నినయించ్చి

పాద.శాహీలు కొండవీటి శీమ సముతు బంద్దీలుచేసి బారాముతసద్ధీ హోదాలు నినయించ్చే యడల యీ గ్రామం పాండ్లు సముతులో దాఖలే చేసి సముతు అమీలు చౌదరు దేశపాండ్యాల పరంగ్గా మల్కీ విభురాం సుల్తానబ్దుల్లా తానీష అలంగ్లీరు మొదలయిన పాదుశాహీలు హైదరబాదు సుబాలో అమానీ మామియ్యతు న్న ౦౧౨౦ ఫసలీ (1711 AD) వరకు జర్గించినారు. గన్కు పైన వ్రాశిన