పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కయిఫియ్యతు తానీషా పాదుశాహావారి ప్రభుత్వములో బడేఖానుడనే సర్దారుకు యీ గ్రామం జాగీరు యిచ్చినారు గన్కు అతను వచ్చి గ్రామంలో ప్రవేశించి జాగీరు అనుభవిస్తూ గ్రామానకు పశ్చిమపాశ్వణం చెరువు త్రవ్వించ్చి.... తానీషావారి అధికారం మట్టుకు జాగీరు అనుభవించ్చినారు. స్న ౦౧౨౨ (1712 AD) ఫసలీలో నవాబు ముఖారసుఖాను బహదురు సుబా దేశస్తు లను పిలువనంపించ్చి కొడ్డవీటి శీమ మూడు పంట్లు చేశి జమీదాలకాకు పంచ్చి పెట్టెయడల యీ గ్రామం వాశిరెడ్డి పద్మనాభునింగారి వంత్తు వచ్చిన చింతపల్లి తాలూకాలో దాఖలు ఆయినది గన్కు పద్మనాభునిఁగారు, చంద్రమౌళిగారు, పెదరామలింగంన్నగారు, నర్సంన్నగారు, సూరంన్నగారు, చిన నర్సంన్నగారు. చిన రామలింగంన్న గారు, జగ్గయ్యగారు, రామంన్నగారు ప్రభుత్వములు చేశిన తర్వాతను రాజా వెంక్కటాద్రి నాయుడు బహద్దరు మంన్నే సుల్తానుగారు ప్రభుత్వము చేస్తూ వుంన్నారు. మజుకూరిలో వున్న దేవాలయముల సంగతి రామలింగంన్నగారి ప్రభుత్వములో యీ సరకారు నాసరి జ గ్గుబహద్దరు సుబావారు ఫరాంసువారి పరం చేశిరి. గన్కు స్న ౧౬౨ (1752 AD) ఫసలీ లగాయతు న్న లా (1757 AD) ఫసలీ వర్కు యేడు సంవత్సరములు అధికారము చేశి దేవాలయములు పాడుచేశి వృత్తి క్షేత్రాలు తీశివేసినారు గన్కు తదాది మొదలు కాని ఖిలపడి వుండెను. స్న ౧౨౦౧ (1791 AD) ఫసలీ పరీధావి నామ సంవత్సరములో దేశ ప్రభువులయిన రాజావాశిరెడ్డి వెంక్కటాద్రి నాయుడు బహదురు మంన్నె సులతాను శ్రీ చంన్న కేశవస్వామి వారికి ఆలయం బాగుచేయించి స్వామివారికి సంప్రోక్షణము చేయించి పూజించడాన్కు వెంక్కటాచార్యులు అనే విఘుసనుంణ్ని న౯యించ్చినారు. అప్పుడే గ్రామస్థులు శ్రీ సోమేశ్వరస్వామి వారికి ఆలయం జీనె౯ద్ధారం చేయించ్చి శ్రీ స్వామి వారికి పునః ప్రతిష్ఠచేశి పూజించడాన్కు రావిపాటి సుబ్బన్న ఆనే శివద్విజుని నిన౯యించినారు గనుక ఉభయ దేవస్థానములకు నిత్య నైవేద్య దీపారాధనలకు జరుగ గంందులకు రాజా వెంక్కటాద్రినాయుడు బహద్దరు మన్నె సుల్తానుగారు చేసిన వసతి. కు 126 వుంన్నది. కు చంన్న కేశవస్వామి వారికి శ్రీ సోమేశ్వరస్వామి వారికి. రెండు కుచ్చళ్లు యినాం యిప్పించినారు గన్కు యీ వరకు సదరహి ప్రకారం జరుగుతూ గిమార్కు గ్రామం గుడి కట్టు కుచ్చళ్లు చాలా బారల పగ్గానకు కి ఇరవయి నాలుగు కుంట్టల ప్రాప్తిని.