కయిఫియ్యతు.
123
శ్లొ॥ సౌభాగ్యా పరభీమ నామ కలితా
లింగ ప్రతిష్ఠా కృతా |
తత్ప్రసాదమ తుల్య భోగ నిలయం
భూమేగిరేః పశ్చిమే౹౹
తాత్పర్యము:- (అసలీ శ్లోకము సంపూర్ణముగా లేదు. ) ఉన్నదానికి మాత్రము భావము.
"కొండవీటి పశ్చిమముగా సాటిలేని భోగములకాస్పద మగునట్లు భీమేశ్వరుని యా ప్రోలమాంబ ప్రతిష్ఠించి యాలయమును గట్టించెను.)
స్వస్తి సమస్త గుణగణాలంకార విగళితమద కళ ద్విమదహంకార కీతి౯రట్ల కులాచల మృగేంద్రి చతుర్థ కులకుముదినేచంద్ర ఆరి బిరుదు మదద్విరద మద నివారణ గొంక్క నరేంద్ర గంధ వారణ తనరం బతి౯పుర వరాధీశ్వర సమభ్యర్చిత భీమేశ్వర వితరణ రణవినోద సంపాదిత బుధజన ప్రమోద విపక్షస్థల దళన బెల్లగడికోట మల్లసులన.
[స్వస్తి సమస్త గుణ గణాలంకారు, విగళిత మదకళద్విరదాహంకార, కీర్తి, రాట్కుల కులాజల, మృగేంద్ర, చతుర్ధకుల కుముదినీ చంద్ర, అరి బిరుద, మదద్విరద మద నివారణ గోంక సరేంద్ర గంధవారణ, పుర వరదీశ్వర సమథ్యర్చిత భీమేశ్వర వితరణ, రణ వినోద, సంపాదిత బుధజన ప్రమోద, విపక్ష వక్షస్థల దళన, బెల్లగడికోట మల్లసులన.]
జనవన వసంత కాంతా జయంత గండరగండ గండనామాది సమస్త ప్రశస్త సహితం॥
[జనవన వసంత, కాంతా
జయంత, గండర గండ,
గండనామాది ప్రశ స్త సహితం॥ ]
శ్రీ మన్మందటి కొండప నాయనుకు ద్వితీయ లక్ష్మీ సమానము మనోనయన వల్లబియు ధర్మాధ౯ కామ సమున్నిత యున్నధి౯జన చింతామణియునైన ప్రోల మాంబిక తనకు ధర్మార్థముగా గొండ్డ పడమటిలోని గుడిపూడిలోన భీమేశ్వర దేవర ప్రతిష్ఠ చేశి గుడికట్టించ్చి యీ దేవరకు భోగా ధ౯ముగా శక పరుషంబులు ౧౦౮౨ (1160 AD) అగునేటి ఉత్తరాయణ సంక్రాంతి నిమిత్తమున గుడిపూడి నిచ్చిన వెలి పొలం ౬౬ పుట్లు దేవర పరిగ్రహమునకు ధారాగ్రహితం చేశి స్తానాపతి పూజారి మొదలయిన వినియోగములు జరిగించ్చి పరిచారిక జనంబులకు నిస౯యించిన వృత్తి క్షేత్రంబులు శాసన స్తంభంబుల మీదను లిఖియింపజేసి శ్రీ స్వామి వారిని పూజించడానకు పద్మనాభుడనే పూజారిని నియమించ్చినారు తదనంత్తరం అమ్మకొండ్డ రాజులు కుమార కాకతీయ రుద్రదేవ మహా