పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గుడిపూడి కయిఫియ్యతు మం॥ గుడిపూడి సంతు పాలడ్డు తాలూకే ఎంత్తపల్లి సర్కారు మృతుకా జాంన్నగరు స్న ౨౨౨ ఫసలీ. (1812 AD) 122 యీ గ్రామాన్కు పూర్వం నుంచ్చింన్నీ గుడిపాడు అనే పేరు వుంన్నది. గజపతి శింహ్వాసనస్థుడయ్ని గణపతి దేవ మహా రాజులుంగారు ప్రభుత్వం చేశేటప్పుడు వీరి దగ్గర మహా ప్రధానులయ్ని గోపరాజు రామన్నగారు శా ౧౦౭8 శా ౧౦౬౭ (1145 AD) ఆగునేటి రక్తాక్షి సంవత్సర భాద్రపద బహుళ 30 ఆంగ్గార్కవారం సూర్యగ్రహణ కాలమందు ప్రభువు దగ్గర దానంపట్టి . సమ స్తమయిన నియ్యోగులకు గ్రామ కరణీకపు మిరాశీలు నినయించే యడల యీ గ్రామానకు గౌతమగోత్రుడయిన రామరాజుకు మిరాశి యిచ్చి కులా భూమి యినాము యిప్పించ్చినారు గన్కు తడాది మొదలుకొని రామరాజు సంతతివారు కొందరు గుడిపూడి వారిని కొందరు పరమాత్ముని వారకి పౌరుష నామము చేతను అనుభవిస్తూ వుంన్నారు. తదనంతరం కుళోత్తుంగ గొంక్క చోడరాజు ప్రభుత్వము చేశేటప్పుడు కొండవీటి కొండ్డ పడమటి దేశాన్కు చతుధకులుడైన కొండమ నాయకునికి అధికాకారము యిచ్చినారు గన్కు అతను ప్రభుత్వము చేస్తూవున్న కాలమందు యీ స్థల మందు జరిగిన సంగతి శ్లో॥ శాకా నయనే చభేందు గణిత పుణ్యాయనే చోత్తర ఖ్యాతే కొండయ నాయకస రమణీ పో లాంబికా రాజితే [శ్లో॥ శాకా నయనే చఖేంధు 11 గణితే పుణ్యాయనే చోత్తరే! ఖ్యాతే కొండయ నాయకస్య రమణీ ప్రోలాంబికా రాజతేః. ] తాత్పర్యము:- శాలివాహన శకము 1102 నాటి యుత్తరాయణ పుణ్యకాలమందు ప్రసిద్ధిఁ జెందిన కొండయ నాయకునికి భార్య పోలమాంబిక యొకతె ప్రకాశించుచుండెను). శ్లో॥ సౌభాగ్య వరభీమనామ్న చేత యా లింగ్డ ప్రతిష్ఠా కృతా। 11 సప్రాసాదము తుల్య భోగ నిలయం భూమింగ్గరై పశ్చిమే ॥