పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

117 అల్లూరు కయిఫియ్యతు కైఫియ్యతు మౌజే అల్లూరు సర్కారు నిజాంపట్నం యిలాకే రాజా వాశిరెడ్డి జగన్నాథబాబు స్న౦౨౨౮ (AD 1818) ఫసలీ మజ్కూరి కరణాలు యల్లా ప్రెగడ, చలమయ్య, యీ అప్పయ్య, యీ క్రిష్టయ్య, కరి సుబ్బరాజు మొదలయ్ని వారు వ్రాయించి పూర్వం త్రేతాయుగమందు అత్రి మహాముని తీధకా యాత్రాపరుడై దివ్య దేశములు సేవిస్తూ మహానది సాగర సంగములందు స్థానంచేస్తూ యీ శింధూ తీరమునకు వచ్చి యిక్కడ వుపాస్తిచేశి నంద్ను విష్ణులక్ష్మీ నురిశింహ్మస్వరూపముతోటి పొడ చూపి ముందు యీ స్థళం దివ్య దేశం కానుంన్నది. నీవు నంన్ను ప్రతిష్ఠచ్చాయమని ఆనతిచ్చి ఆచాణను బింబ్బ రూపమయ్నిందు ఆత్రి మహాముని సంతశించ్చి శ్రీ స్వామి వార్ని ప్రతిష్ట చేసి బహుదినములు అన్కే రుషిగణ సమేతముగా యిక్కడ వాసం చేశి పూజిస్తూ వచ్చినారు! గన్కు ఆత్రేయ పురమని స్థళ మహాత్యం చెప్పబడ్డది. తదనంతరం త్రేత ద్వాపర యుగములు అతిక్రమించ్చి కలియుగం ప్రాప్తముయి యుదిష్టర విక్రమ శకంబులు గడచిన తరువాత, కలికాళచోళ కాలమందు పుట్టిన కుళో త్తుంగ చోళమహారాజు శాలివాహనం ౧౦౩౯ శకం (AD 1117) మొదలుకొని రాజ్యంచేస్తూ వుండ్డి తుంగ్గభద్రానదీతీర మందుల వుండే దివ్య స్థళాలకు అగ్రహారములు మొదలయ్ని వృత్తులు ధారాగ్రహితం చేసి అనేక దేవతా ప్రతిష్ఠలు చేసి ఆకాలమందు............... బహు అరణ్యముగా ఉండును గన్కు ప్రస్తుత నామంగల అల్లూరు యీ అరణ్య మధ్యమందు కొద్దిపల్లెగా వుండేది గన్కురాజు సముద్ర స్థానం నిమిత్తం యీ పల్లెమీదుగా వచ్చి తృణ కాష్ఠజల సమృద్ధిగల స్థళమని అరణ్యం బేధించి గ్రామం బస్తీచేశే యడల అల్లూరమ్మ అనే శ క్తినొక పొద కింద భూగతమై వుండి ఆ రాత్రి రాజు కలలో వచ్చి నీవు కట్టించే గ్రామం నా పేరు బెట్టి నాకు గుడి కట్టించ్చె నంన్ను ప్రతిష్ఠ చేశీ వుత్సవములు జరిగించుమని నేను గ్రామదేవరను ఆయి నీవు చేసిన ప్రతిష్ఠలు కాపాడుతూ వుంటాను. అని తాను వున్న స్థళం చెప్పె గన్కు రాజు అదే ప్రకారం తాను కట్టించి గ్రామానకు అల్లూరు అనే పేరు బెట్టి ఆ స్థళమందు వున్న అల్లూరంమ్మ అనే శక్తిని గ్రామ దేవరగా ప్రతిష్ఠ చేశినాడు!!. గన్కు తదారభ్య అల్లూరు అనే నామాంకితం వహించినది తదనంతరం కృష్ణలో నుంచ్చి శీతాసగరపు గండిని పొంన్నూరు దగ్గర వున్న తుంగభద్రలో నుంచి వచ్చే వుదకం సముద్రగామని గాకుండా యీ గ్రామాన్కు పశ్చిమ భాగం ప్రస్తుతనామం గల