పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

108

గ్రామ కైఫియ్యత్తులు


యిచ్చిరి. గన్కు స్న ౧౧౬౦ ఫసలీ (1750 AD) లగాయతు స్న ౧౧౬२ ఫసలీ (1757 AD) వర్కు ఫరాంసు వారి ప్రభుత్వం చేసి ఆపజయులై పోయినారు శీతన్న మాణిక్యరాయునింగారి తరుణమందు వారి అన్న కొమారులయిన రాజా గోపాల మాణిక్యరాయునింగారు స్న ౧౧౬౮ ఫసలీ (1758 AD) వర్కు ప్రభుత్వం చేశ్ని తరువాతను శీతన్నగారి కొమారులయ్ని రాజా జంగంన్నా మాణిక్యరాయునింగారు స్న ౧౧౬౯ ఫసలీ (1759 AD)లో ప్రభుత్వాన్కు వచ్చి ధర్మవంతుడు అయి ప్రభుత్వం చేస్తూ వుండ్డగా స్న ౧౧२౮ ఫసలీ (1768 AD) విరోధి సంవత్సరములో మజ్కూరి మిరాశిదార్లు అయ్ని వల్లూరి వెంక్కటా చలం పర్వతాలు శంకరప్ప విస్సంరాజు మొదలయ్ని వారు యీ గ్రామంలో యుండి గణపేశ్వరస్వామి వీరభద్రస్వామి వార్ల ఆలయములు జీనో౯ద్ధారం చేయించ్చి స్వామి వార్లకు పునః ప్రతిష్ఠలు చేసి విష్ణుస్తలంలో పూర్వము నుంచి వుంన్న చంన్న కేశవస్వామి విగ్రహము మ్లేచ్చులు భిన్నము చేసిరి గన్కు అంద్కు పునహ వేణు గోపాల విగ్రహం చేయించి ప్రతిష్ఠ చేయించ్చి పూర్వీకమయ్ని, ఆంజనేయస్వామి వారిని ప్రతిష్ఠ చేసినారు గన్కు యీ స్వామివార్లకు నిత్య నై వేద్య దీపారాధనలకు జరుగ గలంద్లుకు చేసిన వసతులు -

కు వూం౨

కు ౧ శ్రీ గణపేశ్వర స్వామి వీరభద్రస్వామి వార్లకు
కు ౧ శ్రీ వేణుగోపాలస్వామి వారికి.
——————
కు ౨ నిత్య నైవేద్య దీపారాధనలకు

వూ ౧ ౨ సాలీయానా వచ్చె పండుగలు దీపారాధన వుత్సవములకు

వూ ౬ శ్రీ గణపేశ్వర శ్రీ వీరభద్రస్వామి వారికి
వూ ౬ శ్రీ వేణుగోపాల స్వామి వారికి.

యీ ప్రకారంగా నిన౯యించ్చి సదరహి ఫసలీ లగాయతు స్న ౧౨౦౧ ఫసలీ (1791 AD) వర్కు ప్రభుత్వములు చేశినారు. స్న ౧౧౯२ ఫసలీ (1787 AD)లో మహారాజ శ్రీ కుంఫిణీ వారు మృతుఁ జాంన్నగరు సర్కారు ప్రభుత్వానకు వచ్చి మూడు సంవత్సరములు అమాని మామిలియ్యతు చేసి తిరిగి జమీదార్ల పరం చేసినారు. తరువాత వీరి కొమారులయ్ని రాజాభావయ్య మాణిక్యరాయునింగారు స్న ౧౨౦౨ ఫసలీ (1792 AD)లో ప్రభుత్వానకు వచ్చి యీ గ్రామంలో యుండే దేవ బ్రాహ్మణ స్వాస్యములు నిరాటంకముగా జరిగిస్తూ ప్రభుత్వం చేస్తూ వున్నారు.

రిమాకు౯ గ్రామం గుడికట్టు కుచ్చళ్ళు ౧२౦ కి మ్నిహాలు.
గ్రామ కంఠాలు.
౧ ౹ ౦ -------------------
౧ ౹ ౦ చికిలింగయ్య పాలెం