పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వల్లూరు

107


వారు ౬ రెడ్లు శాలీవాహనం ౧౨౪౨ శకం (1310 AD) లగాయతు శాలివాహనం ౧౩౪౨ శకం (1420 AD) వరకు ౧౦౦ సంవత్సరములు ప్రభుత్వం చేసిరి గన్కు ఆ దినములలో మజుకూరి మిరాశిదాల్లు౯ అయ్నివాru పయ్ని వ్రాశ్ని గణపేశ్వర స్వామి వారి దేవాలయాన్కి పశ్చిమ పార్శ్వమంద్దు విష్ణు స్తలం కట్టించ్చి శ్రీ చంన్న కేశవస్వామి వార్ని శ్రీ ఆంజనేయస్వామి వార్ని ప్రతిష్ఠ చేసి యీ స్వామి వారిని పూజించడాన్కు పుసులూరి అప్పళాచాలు౯ అనే విషునసుణ్ని నిన౯యించి నిత్య నైవేద్య దీపారాధనల్కు జర్గుగలంద్లుకు ౧ కుచ్చల భూమి యినాము యిప్పించి ప్రభువుల చాత సనదు వ్రాయించినారు. తదనంతరం గజపతి వారు తిర్గి ప్రభుత్వాను వచ్చిలాంగ్గూల గజపతి పురుషోత్తమ గజపతి ప్రతాపరుద్ర గజపతి ప్రభుత్వం చేశ్ని తర్వాతను వీరభద్రగజపతి గారు అధికారం చేస్తూ వుండ్డగా శా ౧౪౩౬ శక (1514 AD) మంద్దు నరపతి శింహ్వాసనస్తుడయ్ని కృష్ణదేవమహారాయులు వీరభద్ర గజవతి వారిని జయించ్చి కొండవీటి దుర్గం పుచ్చుకొని కృష్ణరాయలు అచ్యుత రాయలు సదాశివరాయలు, రామరాయలు వారి అధికారము జరిగిన తర్వాతను స్వస్తిశ్రీ విజయాభ్యుదయ శాలివాహన శకవరుషంబ్బులు ౧౪౯౫ (1573 AD) అగునేటి అంగ్గీరస నామ సంవ్వత్సర ఆషాడ శుద్ధ ౧౧లు శ్రీ మద్రాజాధిరాజ పరమేశ్వర వీర ప్రతాప శ్రీ రంగ్గ దేవ మహాదేవరాయలు విద్యానగరమందు రత్న సింహాసనాశీనులై పృధివి రాజ్యము చేయు చుండగాను వీరి కార్యకత౯ అయ్ని అడ్డప నాగప్పనాయినింగారు యీ దేశం ప్రభుత్వం చేస్తూ వుండి పయిని వ్రాస్ని స్వామి వార్ల యొక్క ఆలయములు మరామతు చేయించి సకలోత్సవములు జరిగేటట్టుగా కట్టడి చేయించినారు.

శా ౧౫౦౦ శకం. (1578 AD) వరకు శ్రీ రంగరాయల వారి ప్రభుత్వం జరిగిన తర్వాతను దేశము మ్లేచ్చా క్రాంత్తా మాయె గన్కు దేశముఖు దేశపాండ్య మొదలయ్ని బారాముత సద్ధిహోదాలు యేప౯రచి సర్కారు సముతు బంద్దీలు చేసేటప్పుడు యీ గ్రామం పొంన్నూరు సముతులో దాఖల్ చేసి సముతు ఆమీలు చౌదరు దేశపాండ్యాల పరంగ్గా అమానీ మామిలీ యతు జర్గే యడల తానీషాపాదుశాహవారి అధికారంలో యీ గ్రామం గాలిబుఖాన్ అనే సరదారునికి జాగీరు యిచ్చిరి గన్కు అతను జాగీరు ఆసుభవిస్తూ యీ గ్రామంలో చెరువు వకటి తవ్వించినాడు.

ఆ దినములలో విస్తరించ్చి తుర్కలు యిక్కడ వుండి దేవస్థానములకు ఆచ౯నాదులు జరుగకుండా చేసినారు.

స్న ౧౧౨౨ ఫసలీ (1712 AD)లో కొండవీటి సీమ జమీదాల౯కు పంచి పెట్టే యడల యీ గ్రామం రమణయ్య మాణిక్య రాయినింగారు వంట్టులో వచ్చి రేపల్లె తాలూకాలో దాఖలు అయినది గంకు రమణయ్య గారు మల్లంన్న గారు శీతంన్న గారు స్ప ౧౧౬౦ ఫసలీ (1750 AD) వరకు ప్రభుత్వం చేసిరి. తదనంతరం నిజాముల్ ముల్కు బహద్దరు సుభావారి పెద్దకుమారులయ్ని నానర జంగ్గు బహద్ధరు గారు యీ సర్కారు ఫరాంశువార్కి