పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

106

వల్లూరు

కయిఫియ్యతు మౌజే వల్లూరు సంతు పొన్నూరు సర్కారు మృతు౯ జాంన్న గరు

తాలూకె రేపల్లె యిలాకే రాజా మాణిక్యారావు భావ నారాయణ రావు.

యీ గ్రామానికి పూర్వము నుంచ్చింన్ని వల్లూరు అనే వాడికె వున్నది. శాలీవాహన శక ప్రవేశమయిన తరువాతను యీ దేశాన్కు గజపతి, నరపతి, అశ్వపతి అనే మూడు శింహ్వాననాలు యేప౯రుచుకొని ముగ్గురు రాజులు ప్రభుత్వం చేస్తూ యుండిరి గన్కు యేతచ్చక గతవత్సరంబ్బులు ౧౦౫౫ (1133 AD) జరిగిన మీదట గజపతి శింహ్వాసనస్తు డయిని గణపతి మహారాజులుంగారు శాలివాహన శక వర్షంబులు ౧౦౫౬ శకం (1134 AD) మొదలుగొని రాజ్యము చేశేటప్పుడు యీ గ్రామాన్కు తూవు౯ భాగమంద్దు శివాలయం గట్టించ్చి స్వనామాంక్కితంగ్గా గణపేశ్వరుడు అనే లింగ్డమూత్తి౯ని ప్రతిష్ఠ చేసి తదనంతరం యీ స్వామి వారి దేవాలయాన్కి దగ్గిరనే యీశాన్య భాగ మంద్దు దేవాలయం కట్టించ్చి శ్రీ భద్రకాళీ సమేతముగా వీరభద్రస్వామి వారిని ప్రతిష్ఠ చేశి యీ స్వామి వార్లను పూజించడాన్కు మూర్తి౯ అనే శివద్విజుంణ్ని నిన౯యించ్చి శ్రీ స్వామి వార్ల యొక్క నిత్య నైవేద్య దీపా రాధనలకు సకలోత్సవములకు జరుగగలంద్లుకు కు ౧ కుచ్చెల పొలం యినాం యిప్పించి మరిన్ని యీ కొండవీటి శీమలో బ్రాహణులకు ౪౪ నలభైనాలుగు అగ్రహారములు సదరహి శక మందునే ధారాగ్రహితం చేశి ధర్మవంతులై ప్రభుత్వం చేశే కాలమంద్దు యీ దేశములో పంచాగ్నులు శూదృలు యిత్యాదులు గ్రామ కరణీకపు హోదాలో యుండి దేవ బ్రాంహ్మణ గౌరవములు తప్పించి ప్రవతి౯స్తూ వుంన్న సంగ్గతి గజపతి గారి దగ్గర మహా ప్రధానులయ్ని గోపరాజు రామన్న గార్కి తెలిసి స్వస్తిశ్రీ శాలివాహన శక పరుషంబ్బులు ౧౦౬२ (1145 AD) అగునేటి రక్తాక్షి సంవ్వత్సర భాద్రపద బహుళ 30 అంగారకవారము సూర్యోపరాగ గ్రహణ పుణ్యకాలమంద్దు కృష్ణానదీ అవిస్తాన కాలమంద్దు ప్రభువు దగ్గిర దానం పట్టి సమ స్తమయ్ని నియ్యోగులకు గ్రామకరణీకపు మిరాశీలు నిన౯యించ్చే యెడల యీ గ్రామాన్కు వెలనాడు శ్రీ వత్సగోత్బలయ్ని వల్లూరి వారికి ఏక భోగంగ్గా మిరాశీ నిన౯ యించ్చి చాలా దినములు ప్రభుత్వం చేసినారు తదనంతరము అనుముకొండ్డ శింహ్వాసనస్తు లయ్ని కాకతీయ వంశజులయ్ని రాజులు కుమార కాకతీయ రుద్ర దేవ మహారాజులు గారు ప్రభుత్వం శాలీవాహనం ౧౨౪౦ శకం (1318 AD) వర్కు జర్గె గన్కు అప్పట్లో వీరి తరఫున కోట భీమరాజు కేతరాజు మొదలయ్ని వారు ధరణికోటలో నివశించి ప్రభుత్వం చేశిరి.

అటుపిమ్మట రెడ్లు బలవంతులైన పరసవేది వల్ల అన్కే ధనం కూచి౯ యీ దేశములు ఆక్రమించి గిరి దుగ౯ స్థలములు నిర్మాణం చేయించ్కుని సోలయ వేమారెడ్డి మొదలయ్ని