పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

105

వల్లూరు

కైఫియ్యతు మౌజే వల్లూరు సంత్తు వినుకొండ యిలాకే మలరాజు వెంక్కట

గుండ్డారావు స్న ౧౧౨౨ ఫసలి మజ్కూరి కరణాలు దంమ్మాపళం నర్సరాజు

వ్రాయించినది.

పూర్వం నుంచ్చి యీ గామాన్కి వల్లూరు అనే వాడికె వుంన్నది. తదనంతరం గజపతి వంశస్తుడయ్ని గణపతి మహారాజులుంగారి దినాలలో వీరి ప్రధానులయ్ని గోపరాజు రామంన్న గారు మిరాశీలు నిన౯యించ్చే యడల యీ గ్రామానికి శ్రీ వత్సవ గోతృలయ్ని యల్లమరాజు అనే సంద్ధవరికికి యేకభోగంగ్గా మిరాశీ యిచ్చినారు గన్కు తదారభ్యం ఆనుభవిస్తూ వుంన్నారు. శాలివాహన శకం ౧౫౦౦ (1578 AD) వర్కు వడ్డెరెడ్డి కనా౯టక ప్రభుత్వములు జర్గిన మీదట మొగలాయి ప్రభుత్వంలో మలరాజు వెంక్కట రామారాయనింగ్గారు యీ మిరాశి...........యిచ్చిరి. తదారభ్యం రామారాయనింగ్గారు పెదనర్సంన్న గ్గారు చ్ని రామారాయనింగ్గారు వెంక్కట గుండ్డారాయనింగ్గారు పెనగుండ్డా రాయనింగ్గారు ప్రభుత్వం చేశ్ని మీదట వెంక్కట నృశింహారాయనింగ్గారి కొమారుడయ్ని వెంక్కట గుండ్డా రాయనింగ్గారు ప్రభుత్వం చేస్తూ వుంన్నారు.

యీ గ్రామం మధ్యమంద్దు ఆంజనేయలు విగ్రహం వుంన్నది. దానికి కుచ్చల మాన్యం జర్గుతూ వున్నది. _ ......డ్డు నుంచ్చి యీ గ్రామం అరిపినేని కోదండ్డరాముడు అనే యత్రశాలి స్వామికి 40 వరహాలు కట్టుబడి నిన్న౯యించ్చి ౧౦౦ జవామలు కొల్చేటట్టు నియామకం చేయించ్చినారు గన్కు తదారథ్యం కట్టుబడి కింద్ద చెల్లుతూ వున్నది

కరణం దంమ్మాదళం నర్సరాజు వ్రాలు.