పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

98

గ్రామ కైఫియత్తులు


స్తల కైంక్కర్యములు జర్పుతూ వచ్చినారు యింత్తలో యీ దేశాన్కు క్షామడాంబ్బరములు వహించ్చినంద్ను స్తానాచార్యులు మొదలయ్ని వారు నిత్య...... నంద్ను దేశాంత్తరం పోయినారు గన్ను యీ జీవనములు వృత్తులు మొదలయ్నివి ఖిలమయిపోయినంద్ను శా ౧౬౯౯ (1688 AD) సంవ్వత్సరం మాణిక్యారావు తిరుపతి రాయినింగ్గారు స్వామి వారి వరుమాన యేప౯రచి కు ౧౨ పంన్నెండ్డు కుచ్చల ఖండ్రికె యిప్పించి నిత్య పడితరములు వగయిరాలు వో........... లు నిన౯యం చేయించ్చినారు గన్కు ఆ ప్రకారం ఆయ్న కొమారుడు శీతయ్య మాణిక్మారావు ప్రభుత్వం వచ్చి రౌద్రి సంవ్వత్సరం వర్కు జర్గినది శీతయ్య గారు సంత్తు లేకుండ్డా జర్గినారు గన్కు వారి తాలూకా భావయ్య గారి వరం చేశ్నింద్ను ఆయ్న కుమారులు.................యిచ్చినారు ఆటు తర్వాతను మాణిక్యారావు భావయ్య గారు (వా) కాశీ వొడ్డె వెంక్కటాద్రి రాయునింగార్కి యీ తాలూకా బాకీ పంట్టు కింద్దను ధరావతు వుంచ్చినంద్ను ఆదే సంవ్వత్సరం వెంక్కటాద్రి నాయుడు గారు తాలూకా మామ్లియ్యతు చేశినారు గస్కు దుందుభి నామ సంవ్వత్సరములో వచ్చిన అయివేజు ప్రకారం జర్పించ్చినారు. యీ తర్వాతను రుధిరోద్గారి నామ సంవ్వత్సరము మొదలుకొని రాజా మల్రాజు వెంక్కట గుండ్గారావు గారు తాలూకా యాటంలో కొంన్నారు గన్కు వారు నిన్న౯యించ్చి జర్పిన లాగురు-

కు ౯ స్వామి వారి నిత్య నయివేద్య దీపారాధనల్కు
కు ౧ అధ్యాపకునికి
కు ౧ ఆచ౯కునికి
కు ౧ భజంత్రీలకు మాన్యం
——————
కు ౧ ౨

యింద్కు తఫిశీలు............................................

సదరహిలో వుంన్న వార్కి జర్గుతూ వున్నది. కళావంత్తులకు నడిచే యినాము స్వామి ఖండ్రికెలోనె దాఖలు అయ్నిది.

యింద్కు లోవయినం మాణిక్యారావు తిరుమల రాయినింగారు యేప౯రచ్ని ప్రకారం హెంన్నులు ౧౨౦౮ గుండ్డారాయినింగారు జర్పుతూ వుంన్నారు.
పడితరం ........
శే ౧ .......
౪ మహ్వవ 30
———————
శే ౪ అయ్ని