పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

97

ముల్లుకుదురు

కయిఫియ్యతు మౌజే ముల్లుకుదురు తాలూకే రాచూరు

పూర్వం ఆత్రిమహాముని కృతయుగమందు శ్రీమన్నారాయునుని గూచి౯ యేకాగ్ర చిత్తత చాత తపస్సు చేశినంద్ను భగవంతుడు ప్రసంన్నుడై వరం వేడుకునే వర్కు ఆత్రి సంత్తొషించ్చి హతాత్పర్య విశేషం చాతను. సమస్కరించి సదా రూపన భక్తింన్ని భూత దయాళు త్వమున్ను దయ చాయవలెను. మరిన్ని మీరు యిక్కడ వశియించ్చి నా చాత పూజింప్పబడుతూ యీ పుణ్యక్షేత్రము అయ్యేటట్టుగా దయచేశినంన్ను కృతాధు౯నిగా చెయ్యమని వేడుకొన్నంద్ను భక్త వశీకృతుడు గన్కు స్వామి వారు అత్రి మహాముని వాక్య ఆలించ్చి అతని యిష్ట ప్రకారం చంన్న కేశవస్వామి రూపం వహించ్చి స్వయం వ్యక్తంగ్గా నిలిచిరి. అత్రిమహాముని స్వామి వార్ని ప్రతిష్ట చేశి తామంన్ను అక్కడనే ఆక్రమం చేస్కుని వశియించినంద్ను అన్కే మునులు యీ దేశాన్కు వచ్చి స్వామి వార్ని శేవించ్చి స్వామివారి దశ౯న కావించ్చి అత్రి మహాముని తోటి సాంగ్గత్యం చాతను యీ స్తలమంద్దే నివాసం చేశినారు. తదనంత్తరం త్రేతాయుగమంద్దు ఆంగ్గీరస మహాముని యీ స్తలమంద్దు తపస్సు చేశినారు గన్కు ప్రసంన్నులయినారు. ద్వాపర యుగ మంద్దు జైమిని మహాముని వ్యాసోప దేశం చాతను యిక్కడికి వచ్చి తపస్సు చేశినంద్ను అతను ప్రసంన్నులై నారట.యీ ప్రకారంగా కృత త్రేత ద్వాపర యుగములయంద్దు మహా రుషులు తపస్సు చేసుటచాతను వార్కి ప్రసంన్నుడైనారు గన్కు అక్కడ మునులు నివాసం చేశియుండ్డుట చాతను ముని కుదరని నామం వహించ్చినది అని భాగ౯వ పురాణమంద్దు చెప్పబడి వుంన్నది.


కలియుగమంద్దు య - రు మానారు వార్కి ప్రసంన్నులయినారట. తదనంత్తరం శాలివాహనం ౧౩౦ - సంవత్సరమంద్దు లక్ష్మి నామ అనే వైష్ణవ భక్తుడు స్వామివార్కి ఆలయ ప్రాకార మంట్టపములు కట్టించ్చి స్వామి వార్కి నిత్యోత్సవ మాసోత్సవ సంవ్వత్సరములు చేయించ్చి వారు గన్కు అదే ప్రకారం అన్కే దినములు జర్గుతూ వుంన్నది ఆటు పింమ్మట గుంటుపల్లి ముత్త రాజయ్యగారు కొండ్డవీటి శీమ ప్రభుత్వాన్కి వచ్చిన తర్వాతను ఆయ్న ధర్మవంత్తుడు గన్కు యీ....... దేవస్తానముల్కు వనములు ఖండ్రిప్రోలు మొదలయ్నివి యేప౯రచి జర్గెను. అంత్త సమయమంద్దు శాలివాహనం ౧౫౩౨ (1610 AD) శకం వర్కు ముత్తరాజయ్య గారి ఆనతి.....ప్పరాజయ్య గారు స్వామి వారి నిత్యోత్సవ మానోత్సవ సంవ్వత్సరోత్సవముల్కు గాను సంన్నిధి అయ్యంగాళ్లు వేతాచిత్తం వేంక్కట శేషయ్య యీ వెంన్నయ్య శింగ్గయ్యరంగయ్య గారు మొదలయ్ని వారి పరంగ్గా కు ౧౫ పదిహేను కుచ్చళ్ళ ఖండ్రికే మాన్యముగా యిప్పించ్చిరి గన్కు అంద్దులో శ్రీ స్వామి వార్కి